ఎయిర్ టెల్ భరోసా.. రెండు నిబంధనలతో రూ. 5 లక్షల బీమా..!

పేమెంట్స్‌ బ్యాంక్‌లో తనదైన ముద్రవేసేందుకు ఎయిర్‌టెల్ కస్టమర్లను ఆకర్షించేపనిలో పడింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు సరికొత్త సేవలతో వినియోగదారుల ముందుకు వచ్చింది. రూ. 5లక్షల వ్యక్తిగత ప్రమాద భీమా పొందేలా..భరోసా సేవింగ్ అకౌంట్‌ను ప్రవేశపెట్టింది. ప్రతినెల కనీస నిల్వా.. రూ.500 ఉంచితే.. ఈ బీమాకి అర్హులవుతారని ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు ఎండీ అనుబ్రాతా బిస్వాస్‌ తెలిపారు. అయితే.. కనీస బ్యాలెన్స్‌తో పాటుగా.. ప్రతి నెల డెబిట్ కార్డుతో కనీసం ఒక లావాదేవీలు జరపాలని తెలిపారు. […]

ఎయిర్ టెల్ భరోసా.. రెండు నిబంధనలతో రూ. 5 లక్షల బీమా..!
Follow us

| Edited By:

Updated on: Sep 18, 2019 | 2:50 AM

పేమెంట్స్‌ బ్యాంక్‌లో తనదైన ముద్రవేసేందుకు ఎయిర్‌టెల్ కస్టమర్లను ఆకర్షించేపనిలో పడింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు సరికొత్త సేవలతో వినియోగదారుల ముందుకు వచ్చింది. రూ. 5లక్షల వ్యక్తిగత ప్రమాద భీమా పొందేలా..భరోసా సేవింగ్ అకౌంట్‌ను ప్రవేశపెట్టింది. ప్రతినెల కనీస నిల్వా.. రూ.500 ఉంచితే.. ఈ బీమాకి అర్హులవుతారని ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు ఎండీ అనుబ్రాతా బిస్వాస్‌ తెలిపారు. అయితే.. కనీస బ్యాలెన్స్‌తో పాటుగా.. ప్రతి నెల డెబిట్ కార్డుతో కనీసం ఒక లావాదేవీలు జరపాలని తెలిపారు. ఈ రెండు నిబంధలను పాటిస్తే.. ఆ వినియోగదారుడికి రూ.5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమాను పొందవచ్చని తెలిపారు.

ఈ సౌకర్యం ఆన్‌ బ్యాంక్‌, అండర్‌ బ్యాంక్‌ కస్టమర్లకు ప్రత్యేక అవసరాలను తీర్చడానికి రూపొందించినట్లు పేర్కొంది. ఖాతాదారులు ఏవైనా ప్రభుత్వ రాయితీలు పొందే సందర్భంలో నగదును కూడా తిరిగి పొందవచ్చు అని తెలిపారు. భరోసా సేవింగ్స్‌ ఖాతా ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని.. ఈ పథకం ఆర్థికంగా వెనకబడిన వారి అవసరాలు తీర్చడానికి ఎంతో ఉపయోగపడుతుందని పేమెంట్ బ్యాంక్ ఎండీ అన్నారు. ఇండియన్ బ్యాంకింగ్ రంగంలో వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విస్తృత పరిశోధనల తర్వాత ఈ భరోసా సేవింగ్ అకౌంట్ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఖాతా వినియోగదార్లు దేశంలో ఉన్న 6,50,000 ఏపీఎస్‌ అవుట్‌లెట్లలో నగదు తనిఖీలు, ఉపసంహరణలు చేసుకోవచ్చని ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ ఎండీ అనుబ్రాతా బిస్వాస్ తెలిపారు.