మళ్లీ విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ

హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. తాజాగా.. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 60 కేసులు నమోదు కాగా.. 14 మంది మృతి చెందారు. మరో ఆరుగురికి హెచ్1 స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు గుర్తించారు. వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని గాంధీ ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా చలికాలంలోనే స్వైన్‌ఫ్లూ విజృంభిస్తుంది. ఎండలకు స్వైన్‌ఫ్లూ వైరస్ చనిపోతుంది. కానీ.. ఇప్పుడు స్వైన్‌ఫ్లూ వైరస్ ఉష్ణోగ్రతలను తట్టుకునే స్థాయికి ఎదిగింది. హైదరాబాద్లో స్వైన్‌ఫ్లూ వైరస్ విజృంభిస్తుండటంతో రోజురోజుకీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు బయటకు […]

మళ్లీ విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ
Follow us

| Edited By:

Updated on: Mar 21, 2019 | 1:01 PM

హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. తాజాగా.. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 60 కేసులు నమోదు కాగా.. 14 మంది మృతి చెందారు. మరో ఆరుగురికి హెచ్1 స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు గుర్తించారు. వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని గాంధీ ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు.

సాధారణంగా చలికాలంలోనే స్వైన్‌ఫ్లూ విజృంభిస్తుంది. ఎండలకు స్వైన్‌ఫ్లూ వైరస్ చనిపోతుంది. కానీ.. ఇప్పుడు స్వైన్‌ఫ్లూ వైరస్ ఉష్ణోగ్రతలను తట్టుకునే స్థాయికి ఎదిగింది. హైదరాబాద్లో స్వైన్‌ఫ్లూ వైరస్ విజృంభిస్తుండటంతో రోజురోజుకీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ప్రజలు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రెండు రోజులకు మించి జ్వరం కనిపిస్తే తక్షణమే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలంటున్నారు. ఎవరైనా స్వైన్‌ఫ్లూ లక్షణాలతో బాధపడినట్లు కనిపిస్తే వారికి దూరంగా ఉండాలన్నారు వైద్యులు