భారత నౌకాదళ చీఫ్‌గా కరంబీర్ సింగ్

భార‌త నౌకాద‌ళ చీఫ్‌గా అడ్మిర‌ల్ క‌రంబీర్ సింగ్ ఇవాళ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. అడ్మిర‌ల్ సునిల్ లంబా నుంచి క‌రంబీర్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సందర్భంగా 24వ నేవీ చీఫ్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం గొప్ప గౌర‌వంగా భావిస్తాన‌ని క‌రంబీర్ తెలిపారు. అడ్మిర‌ల్ సునిల్ లంబా.. భార‌త నౌకాద‌ళాన్ని ఎంతో ప‌టిష్టం చేశార‌ని కరంబీర్ కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *