“ఎవరు’ అడవి శేష్‌ “మేజర్‌’ గా మారనున్నాడు..!

Adivi Seshu next movie Major, “ఎవరు’ అడవి శేష్‌ “మేజర్‌’ గా మారనున్నాడు..!

క్షణం, అమీతుమీ, గూఢాచారి, తాజాగా “ఎవరు’ సినిమాతో హ్యాట్రిక్‌ కొట్టిన యంగ్‌ హీరో అడవి శేష్‌, మరో మూవీకి రెడీ అవుతున్నాడు. సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నఈ మూవీ కోసం అడవి శేష్‌ ఇప్పటికే తీవ్రంగా శ్రమిస్తున్నాడట. సినిమాలో తన మిలటరీ అధికారి క్యారెక్టర్‌ కావటంతో..నిజమైన సైనికుడిగా కనిపించేందుకు భారీగా వెయిట్ లాస్‌ కోసం ట్రై చేస్తున్నాడట.
అందుకోసం స్ట్రిక్ట్ డైట్‌ ప్లాన్‌ చేసుకుని..ఖచ్చితంగా ఫాలో అవుతున్నాడట. ఇంతకీ అడవి శేష్‌ కొత్త మూవీ ఎంటో తెలుసా.. అశోక చక్ర అవార్డు పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా తీస్తున్న మేజర్‌..ఈ చిత్రాన్ని మహేష్‌ బాబు నిర్మిస్తుండగా..తొలిసారిగా అడవి శేష్‌ బయోపిక్‌లో నటించనున్నాడు. చూడాలి మరీ మేజర్‌గా అడవి శేష్‌ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటాడో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *