“మిడిల్ క్లాస్ ఫండ్ ” తో విజయ్ దేవరకొండ ఏం చేశాడంటే..!

లాక్ డౌన్ తో చితికిపోయిన బతుకులకు ఆసరా నిలచారు హీరో విజయ్ దేవరకొండ. ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునేందుకు " దేవరకొండ ఫౌండేషన్" ద్వారా సేవాకార్యక్రమాలు మొదలు పెట్టాడు.

మిడిల్ క్లాస్ ఫండ్  తో విజయ్ దేవరకొండ ఏం చేశాడంటే..!
Follow us

|

Updated on: Jun 06, 2020 | 9:41 PM

లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునేందుకు తారా లోకం తమ వంతు సాయం అందిస్తోంది. బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఏకంగా వలసకూలీలకు రవాణా సౌకర్యాలు సమకూర్చితే, విలక్షణ నటుడు జగపతిబాబు 14 వేల మందికి నిత్యవసరాలు అందించాడు. ఇటు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నేనున్నానంటూ ముందుకొచ్చారు. నిత్యవసర సరుకులతో పాటు ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నారు. లాక్ డౌన్ తో చితికిపోయిన బతుకులకు ఆసరా నిలచారు హీరో విజయ్ దేవరకొండ. ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునేందుకు ” దేవరకొండ ఫౌండేషన్” ద్వారా సేవాకార్యక్రమాలు మొదలు పెట్టాడు. ముఖ్యంగా “మిడిల్ క్లాస్ ఫండ్ “పేరుతో మధ్యతరగతి వారికి సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నాడు. ఇప్పటివరకు ఈ ఫౌండేషన్ ద్వారా 17,723 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు సంస్థ తెలిపారు. ఇందుకోసం రూ. 1.7 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇక ఈ ఫౌండేషన్ ద్వారా 58,808 కుటుంబాలకు సమయానికి సహాయం అండగా, 8,505 వాలంటీర్లు ద్వారా 1.5 కోట్ల రూపాయలు దాతల ద్వారా సమకూరింది. ఫౌండేషన్ కార్యకలాపాల్లో పారదర్శకత కోసం పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు వెబ్ సైట్ , సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తున్నారు పౌండేషన్ సభ్యులు. ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ” ఫస్ట్ జాబ్ ప్రోగ్రామ్” ఇనీషియేటివ్ ద్వారా సాయం అందిస్తున్నారు. ఫౌండేషన్ తరుపున సేవలందించేందుకు వివిధ కార్పొరేట్ సంస్థలకు చెందిన 535 మంది ముందుకొచ్చి కష్టకాలంలో పేద కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నారని పౌండేషన్ సభ్యలు తెలిపారు.