గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పోసాని మద్దతు..అన్నగారి తర్వాత కేసీఆరే అంటూ

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీకి తన మద్దతు ప్రకటించారు ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి. కారు పార్టీ కే ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

  • Ram Naramaneni
  • Publish Date - 1:01 pm, Sat, 21 November 20

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీకి తన మద్దతు ప్రకటించారు ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి. కారు పార్టీ కే ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. మేయర్ పీఠం టీఆర్ఎస్‌కు దక్కితేనే హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంటుందని, లా అండ్ ఆర్డర్ మెరుగ్గా ఉందని ఆమన అభిప్రాయపడ్డారు. గతంలో హైదరాబాద్ అంటే మత కల్లోలాలే గుర్తొచ్చేవని, కేసీఆర్ సీఎం అయ్యాక నగరం మత కల్లోలాలకు అడ్డుకట్ట పడిందన్నారు. దివంగత ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ పాలనలోనే హైదరాబాద్ ప్రశాంతంగా ఉందన్నారు.  హైదరాబాద్ ప్రజలు సురక్షితంగా ఉండగలుగుతున్నారు అంటే.. అది కేసీఆర్ వల్లే అన్నారు పోసాని.

గతంలో ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో పచ్చదనం తక్కువగా ఉండేదని, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అంతటా పచ్చదనం పరుచుకుందని పోసాని కృష్ణమురళి కొనియాడారు.  కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో కేవలం ఆంధ్రా నాయకుల మీదే కోపాన్ని ప్రదర్శించారని, ప్రజలపై కాదని చెప్పారు. కేసీఆర్ సీఎం అయితే ఆంధ్రా ప్రజలను హైదరాబాద్ నుంచి తరిమికొడతారన్న తప్పుడు ప్రచారం చేశారని, కానీ ఈ ఆరేళ్లలో అలాంటి ఘటనలేమీ ఎక్కడా జరగలేదన్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో వచ్చిన వరదలను అవకాశంగా తీసుకుని టీఆర్ఎస్ ప్రభుత్వంపై‌ విమర్శలు చేయడం సరికాదన్నారు. వంద సంవత్సరాల క్రితం ఇంతకంటే భారీ వరదలు వచ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. నిజాం కాలంలో చేపట్టిన డ్రైనేజీ వ్యవస్థను ఆక్రమించి బిల్డింగులు నిర్మించుకోవడం వల్లే ఇప్పుడీ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు.

Also Read :

సాయం చేస్తే మోసం..చంపుతామని బెదిరింపులు..పోలీసులను ఆశ్రయించిన వందేమాతరం

ఈమె అందంతో కుర్రకారు షేక్, రెమ్యూనరేషన్‌తో ప్రొడ్యూసర్లు షాక్ !

కోవిడ్ బారినపడ్డ జూనియర్‌ ట్రంప్‌..ప్రస్తుతం క్వారంటైన్..నో సింటమ్స్