ఇది షాకింగే…ఆరోన్ ఫించ్ త‌న‌ జట్టులో రోహిత్​కు ఛాన్స్ ఇవ్వ‌లేదు..

ఈ మధ్య ఎవరు తమ వ‌ర‌ల్డ్ ఎలెవన్ తయారు చేసినా రోహిత్ పేరు త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. కానీ ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ అనౌన్స్ చేసిన‌ ఆసీస్-భారత్ కంబైన్డ్ జట్టులో మాత్రం హిట్​మ్యాన్​కు చోటివ్వలేదు.

ఇది షాకింగే...ఆరోన్ ఫించ్ త‌న‌ జట్టులో రోహిత్​కు ఛాన్స్ ఇవ్వ‌లేదు..
Follow us

| Edited By: Team Veegam

Updated on: Jun 05, 2020 | 5:41 PM

రోహిత్ శ‌ర్మ‌..ప్ర‌స్తుతం వ‌రల్డ్ క్రికెట్ లో టాప్ ప్లేయ‌ర్. ఏ ఫార్మాట్ అయినా రోహిత్ ట్రాక్ రికార్డ్ అనిత‌ర సాధ్యం. ముఖ్యంగా వ‌న్డేల‌లో అయితే రోహిత్ రికార్డుల హోరు మాములుగా ఉండ‌దు. ఈ మధ్య ఎవరు తమ వ‌ర‌ల్డ్ ఎలెవన్ తయారు చేసినా రోహిత్ పేరు త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. కానీ ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ అనౌన్స్ చేసిన‌ ఆసీస్-భారత్ కంబైన్డ్ జట్టులో మాత్రం హిట్​మ్యాన్​కు చోటివ్వలేదు. ఓపెన‌ర్స్ గా సెహ్వాగ్, గిల్​క్రిస్ట్​లను ఎంపిక చేశాడు.

“సెహ్వాగ్​ ఫ‌స్ట్ క్లాస్ ప్లేయ‌ర్. ప్రత్యర్థిని ఎప్పుడూ డామినేట్ చేస్తాడు. అతడు క్రీజులో ఉంటే ప్ర‌త్య‌ర్థి టీమ్ గెలుపుపై న‌మ్మ‌కం వ‌దులుకోవాల్సిందే. మరో ఓపెనర్​గా రోహిత్​ను సెల‌క్ట్ చేద్దామ‌నుకున్నా. కానీ సెహ్వాగ్​, గిల్​క్రిస్ట్​ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే చూడాల‌నుకున్నా‌. అందుకే గిల్​క్రిస్ట్​ను ఎంపిక చేశా” అని ఆరోన్ ఫించ్ పేర్కొన్నాడు.

ఇక థ‌ర్డ్, ఫోర్త్ ప్లేసుల్లో రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీలను ఎంపిక చేశాడు ఫించ్. అలాగే ఐదు, ఆరు స్థానాల్లో టాప్ క్లాస్ ఆల్​రౌండర్లు హార్దిక్ పాండ్య, ఆండ్రూ సైమండ్స్​ను సెల‌క్ట్ చేశాడు. ఏడవ స్థానంలో భార‌త మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఛాన్స్ ఇచ్చాడు. ధోనీ, గిల్​క్రిస్ట్ ఎవరైనా కీపింగ్ చేయొచ్చని అన్నాడు. ఇక‌ బౌలర్ల విషయానికి వస్తే బ్రెట్​లీ, మెక్​గ్రాత్, జస్ప్రీత్ బుమ్రాను ఎంచుకున్నాడు. కానీ స్పిన్నర్​ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. “బ్రాడ్ హాగ్ రికార్డు ఇంప్రెసీవ్ గా ఉంది. రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్ ల‌ను తీసుకుంటే ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్​కు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ వీరిలో ఎవరిని తీసుకోవాలో అర్థం కావట్లేదు.” అంటూ చెప్పుకొచ్చాడు ఫించ్.

ఫించ్​ ఆసీస్-భారత్ ఎలెవన్ జ‌ట్టు : వీరేంద్ర సెహ్వాగ్ (ఓపెనర్​)​, ఆడమ్ గిల్​క్రిస్ట్ (ఓపెనర్​), రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, ఆండ్రూ సైమండ్స్, ధోనీ, బ్రెట్​లీ, (ఈ ప్లేస్ సెల‌క్ట్ చేయలేదు), మెక్​గ్రాత్, జస్ప్రీత్ బుమ్రా.

క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
ఐదేళ్లల్లో ఎంత మార్పు..? ఎన్నికల మధ్య ఊహించని లాభాలు
ఐదేళ్లల్లో ఎంత మార్పు..? ఎన్నికల మధ్య ఊహించని లాభాలు