పీఎస్‌ ఎదుటే గొంతుకోసుకున్నయువకుడు

A man who screams in front of Police Station, పీఎస్‌ ఎదుటే గొంతుకోసుకున్నయువకుడు

భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఓ యువకుడు ఏకంగా పోలీస్‌ స్టేషన్‌ ముందే గొంతు కోసుకున్నాడు. ఈ సంఘటన నాగర్‌ కర్నూల్‌ జిల్లా బిజినపల్లి మండలంలో చోటు చేసుకుంది. నిజాముద్దీన్‌ అనే వ్యక్తికి అతని భార్యకుకొన్ని ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తరచూ తాగిన మైకంలో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తూ ఆత్మహత్య చేసుకుంటానంటూ విసిగించేవాడని నాగర్‌ కర్నూలు ఎస్‌ఐ భగవంత్‌ రెడ్డి తెలిపారు. అయితే, ఈ సారి నాగర్‌ కర్నూల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి..బెదిరించడంతో.. వారు బిజినపల్లి పీఎస్‌కు వెళ్లమని చెప్పారు. దీంతో పోలీసులు తనను పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ…బ్లేడ్‌తో గొంతుకొసుకున్నాడు. దీంతో పోలీసులు హుటాహుటినా అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *