ఆన్​లైన్ క్లాసెస్ వినేందుకు ఫోన్ లేదని బాలుడు ఆత్మహత్య

ఆన్​లైన్​లో క్లాసెస్ చూడాలనే ఓ బాలుడి కోరిక ఆత్మహత్యకు దారి తీసింది. మొబైల్ ఫోన్ లేదనే బాధతో బాలుడు(15) ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.

ఆన్​లైన్ క్లాసెస్ వినేందుకు ఫోన్ లేదని బాలుడు ఆత్మహత్య
Follow us

|

Updated on: Sep 11, 2020 | 2:22 PM

ఆన్​లైన్​లో క్లాసెస్ చూడాలనే ఓ బాలుడి కోరిక ఆత్మహత్యకు దారి తీసింది. మొబైల్ ఫోన్ లేదనే బాధతో బాలుడు(15) ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..విజయవాడ సిటీలోని విద్యాధరపురం ఏరియాకు చెందిన ఓ బాలుడి తల్లి పువ్వులు అమ్ముకుని జీవనం సాగిస్తోంది. బాలుడి వయసు 11 నెలలప్పుడు తండ్రి వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో తల్లే కుమారుడ్ని అనేక కష్టనష్టాలకోర్చి పెంచుతోంది. వచ్చే కొద్ది సంపాదనతోనే అతడిని చదివిస్తోంది. ప్రస్తుతం బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కోవిడ్ లాక్ డౌన్ వల్ల స్కూల్స్ మూసి ఉన్న సంగతి తెలిసిందే. సప్తగిరి ఛానల్ లో వస్తున్న ఆన్​లైన్​ క్లాసెస్ వింటున్నాడు. స్మార్ట్ ఫోన్ ఉంటే.. యూట్యూబ్ లో తరగతులు వినేవాడినంటూ తల్లితో చెబుతూ బాధపడుతూ ఉండేవాడు. దీంతో తల్లి.. తమ వద్ద అంత డబ్బు లేదని, స్కూల్స్ తెరిస్తే పాఠాలు చెబుతారని, ఫోన్ అవసరం ఉండదంటూ నచ్చజెబుతూ వస్తోంది.

బుధవారం మధ్యాహ్నం కుమారుడు స్నానం చేసి రమ్మని చెప్పింది. స్నానానికి బాత్ రూమ్ లోకి వెళ్లిన బాలుడు, ఎంత సేపటికి బయటకు రాకపోవటంతో వెళ్లి చూసింది. ఉరి వేసుకుని విగత జీవిగా కనిపించాడు. షాక్ కు గురైన తల్లి.. ఆటోలో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లింది. వారు చేర్చుకోకపోవడంతో గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా.. డాక్టర్లు పరీక్షించి చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఆసుపత్రి నుంచి భవానీపురం పోలీసులకు వచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : అభిమాని ఆకస్మిక మరణం.. గుండె పగిలింది అంటూ మహేష్ ట్వీట్

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?