ఏపీలో.. ఐదో విడత ఉచిత రేషన్ ప్రారంభం..

ఏపీలో ఐదో విడత ఉచిత రేషన్ పంపిణి ప్రారంభమైంది. రేషన్ కార్డులు ఉన్నవారికి ఒకరికి 5 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేస్తుండగా.. రాష్ట్రంలోని 1.కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.

ఏపీలో.. ఐదో విడత ఉచిత రేషన్ ప్రారంభం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 29, 2020 | 11:25 AM

Free Ration distribution in AP: ఏపీలో ఐదో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభమైంది. రేషన్ కార్డులు ఉన్నవారికి ఒకరికి 5 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేస్తుండగా.. రాష్ట్రంలోని 1.48 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. రేషన్ తీసుకునే వారికి షాపుల వారీగా కూపన్లు పంపిణీ చేయగా.. పోర్టబిలిటీ ద్వారా.. ఏ జిల్లాలో ఉంటె ఆ జిల్లాలో రేషన్ తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. అయితే.. బయోమెట్రిక్ ద్వారా లబ్ధి దారులకు రేషన్ ఇవ్వనున్నారు.

కాగా.. ఏపీలో మర్చి 29 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం పేదలకు నాలుగు విడతలుగా ఉచితంగా సరుకులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రతీసారి లబ్దిదారులకు టైం స్లాట్ ఉన్న కూపన్లను ఇస్తారు. అవి తీసుకుని కార్డుదారులు సంబంధిత రేషన్ షాపులకు వెళ్లి సరుకులను తీసుకుంటుంటారు. కరోనా నేపథ్యంలో ప్రజలు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి రేషన్ దుకాణాల వద్ద తప్పకుండా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read: ఏపీలో ఇంటర్ ప్రైవేటు కాలేజీ అడ్మిషన్లకు.. నయా రూల్స్..