ఎస్ బ్యాంక్ ఫ్రాడ్.. తవ్వే కొద్దీ ‘కోట్ల’ రుణాలు..అన్నీ తిరిగి ‘రానివే’!

ఎస్ బ్యాంక్ ఫ్రాడ్ ఇంతింత కాదయా అన్నట్టు సాగుతోంది. 10 బడా గ్రూపులకు చెందిన 44 కంపెనీలు ఈ బ్యాంకు నుంచి రూ.34 వేల కోట్ల రుణాలను అప్పనంగా పొందాయని వెల్లడయింది.

ఎస్ బ్యాంక్ ఫ్రాడ్.. తవ్వే కొద్దీ 'కోట్ల' రుణాలు..అన్నీ తిరిగి 'రానివే'!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 12, 2020 | 4:10 PM

ఎస్ బ్యాంక్ ఫ్రాడ్ ఇంతింత కాదయా అన్నట్టు సాగుతోంది. 10 బడా గ్రూపులకు చెందిన 44 కంపెనీలు ఈ బ్యాంకు నుంచి రూ.34 వేల కోట్ల రుణాలను అప్పనంగా పొందాయని వెల్లడయింది. వీటిని ఆయా కంపెనీలు, సంస్థలు అసలు చెల్లిస్తాయా లేక చేతులెత్తేస్తాయా అన్నది తెలియడంలేదు. అనిల్ అంబానీ గ్రూపునకు చెందిన కనీసం తొమ్మిది కంపెనీలు రూ. 12,800 కోట్ల రుణాలను, సుభాష్ చంద్ర  ఎస్సెల్ గ్రూపునకు చెందిన 16 సంస్థలు రూ. 8,400 కోట్లను రుణాలుగా పొందాయి. దేవన్ హోసింగ్ కార్పొరేషన్ కు అనుబంధంగా ఉన్న బిలీఫ్ రియల్టర్స్ గ్రూపు రూ. 4,735 కోట్లను  తీసుకోగా.. ఎస్ బ్యాంకు….  జెట్ ఎయిర్ వేస్ కు 1100 కోట్లను అప్పుగా ఇచ్చింది.

ఇంకా…. కెర్కర్ గ్రూపునకు చెందిన కాక్స్ అండ్ కింగ్స్, గో ట్రావెల్స్ అనే రెండు సంస్థలు వెయ్యి కోట్లను అందుకోగా.. బీ.ఎం.ఖైతాన్ గ్రూపునకు చెందిన మెక్ లియాడ్ రసెల్ సంస్థ 373 కోట్లను, ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ 2,710 కోట్లను, రేడియస్ డెవలపర్స్ 1200 కోట్లను, థాపర్ గ్రూపునకు అనుబంధంగా ఉన్న సీజీ పవర్.. 500 కోట్లను రుణాలుగా పొందాయి. ఎస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రానాకపూర్ నియమాలను పక్కనబెట్టి ఇలా ఇష్టం వఛ్చినట్టు ఈ సంస్థలకు ‘బ్యాడ్ లోన్స్’ ఇఛ్చి చేతులు దులుపుకున్నారని ఈడీ అధికారులు చెబుతున్నారు.