దీదీ సంచలన నిర్ణయం.. రీజన్ ఇదేనా..?

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కరోనా లాక్‌డౌన్‌ వేళ.. సంచలన నిర్ణయ తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 మంది పోలీసు ఉన్నతాధికారులను ఉన్నఫలంగా ట్రాన్స్‌ఫర్  చేస్తున్నట్లు దీదీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రయోజనార్థమై ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెస్ట్ బెంగాల్ పోలీస్ డైరక్టరేట్ శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫర్‌ అయిన అధికారుల లిస్టులో వెస్ట్ బెంగాల్‌ టెలీకాం డిప్యూటీ ఎస్పీ, బారాక్‌పూర్ ట్రాఫిక్ ఏసీపీ, బరుయ్‌పూర్ పీడీ డిప్యూటీ […]

దీదీ సంచలన నిర్ణయం.. రీజన్ ఇదేనా..?
Follow us

| Edited By:

Updated on: May 01, 2020 | 6:13 PM

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కరోనా లాక్‌డౌన్‌ వేళ.. సంచలన నిర్ణయ తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 మంది పోలీసు ఉన్నతాధికారులను ఉన్నఫలంగా ట్రాన్స్‌ఫర్  చేస్తున్నట్లు దీదీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రయోజనార్థమై ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెస్ట్ బెంగాల్ పోలీస్ డైరక్టరేట్ శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫర్‌ అయిన అధికారుల లిస్టులో వెస్ట్ బెంగాల్‌ టెలీకాం డిప్యూటీ ఎస్పీ, బారాక్‌పూర్ ట్రాఫిక్ ఏసీపీ, బరుయ్‌పూర్ పీడీ డిప్యూటీ ఎస్పీ (క్రైం), జల్పైగురి డీఈబీ డిప్యూటీ ఎస్పీ, పశ్చిమ బెంగాల్ సీఐడీ డిప్యూటీ ఎస్పీ, డార్జిలింగ్ (యూటీ) డిప్యూటీ ఎస్పీ సహా.. పలువురు ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు.

కాగా.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతూ నెల రోజులకు పైగా అయ్యింది. ఈ క్రమంలో తాజాగా పోలీస్ ఉన్నతాధికారుల ట్రాన్స్‌ఫర్స్‌ సంచలనంగా మారింది. ఇందుకు తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలే కారణమై ఉంటుందని పలువురు అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడిలో భాగంగా చేపట్టిన లాక్‌డౌన్‌ నిబంధనలను మమతా సర్కార్ కఠినంగా నిర్వహించలేకపోతుందన్న ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు హౌరా ప్రాంతంలో ఇటీవల పోలీసులపైకి రాళ్ల దాడి జరిగిన సంఘటన పెద్ద ఎత్తున దుమారం లేపడంతో.. ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.