మళ్లీ శబరిమల అయ్యప్ప దర్శనానికి సిద్ధమైన మహిళలు..

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లేందుకు మళ్లీ మహిళలు సిద్ధమవుతున్నారు. యుక్తవయస్సులో ఉన్న మహిళలు ఆలయ ప్రవేశంపై ఏళ్ల తరబడి నిషేధం కొనసాగుతోంది. అయితే గతేడాది సుప్రీంకోర్టు మహిళల ప్రవేశ నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై..  దేశ వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు, పలు హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. సుప్రీం తీర్పుపై హిందూ సంఘాలు, ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై చీఫ్‌ […]

మళ్లీ శబరిమల అయ్యప్ప దర్శనానికి సిద్ధమైన మహిళలు..
Follow us

| Edited By:

Updated on: Nov 15, 2019 | 2:26 AM

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లేందుకు మళ్లీ మహిళలు సిద్ధమవుతున్నారు. యుక్తవయస్సులో ఉన్న మహిళలు ఆలయ ప్రవేశంపై ఏళ్ల తరబడి నిషేధం కొనసాగుతోంది. అయితే గతేడాది సుప్రీంకోర్టు మహిళల ప్రవేశ నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై..  దేశ వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు, పలు హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. సుప్రీం తీర్పుపై హిందూ సంఘాలు, ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపి ఫిబ్రవరి 6న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా గురువారం తీర్పు వెలువడుతుందనుకున్న సమయంలో.. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో శబరిమల ఆలయ దర్శనానికి మహిళలకు అనుమతినిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.

అయితే ఇదే క్రమంలో ఆలయ కమిటీ అయ్యప్ప స్వామి దర్శనానికి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌లను ప్రారంభించింది. అయితే ఈ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లలలో ఇప్పటి వరకు 36 మంది మహిళలు కూడా పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, గతేడాది అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేందుకు యుక్త వయస్సులో ఉన్న 740 మంది మహిళలు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న మహిళల వివరాలను పోలీసులు సేకరించారు. అనంతరం వారి ఇళ్లకు వెళ్లి విచారణ చేయగా.. స్వామి వారి దర్శనానికి రావడం లేదని తేలింది. తాజాగా ఇప్పుడు 36 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్న మహిళల వివరాలను కూడా పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. మరి ఈసారి ఏం జరుగుతుందో వేచిచూడాలి.

Latest Articles
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..