ఆరోగ్యశ్రీ ఆసుపత్రిలన్నింటిలో ఆరోగ్యమిత్రలను నియమించాలి

రాష్ట్రంలో కోవిడ్‌–19 పరిస్థితులపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అన్నారు

ఆరోగ్యశ్రీ ఆసుపత్రిలన్నింటిలో ఆరోగ్యమిత్రలను నియమించాలి
Follow us

| Edited By:

Updated on: Oct 09, 2020 | 4:10 PM

YS Jagan Covid 19 review: రాష్ట్రంలో కోవిడ్‌–19 పరిస్థితులపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ ఆసుపత్రలన్నింటిలో ఆరోగ్య మిత్రలను నియమించాలని సూచించారు. ఆసుపత్రుల్లో వైద్య సేవలు, సదుపాయాలకు గ్రేడింగ్‌ ఇవ్వాలని.. దీనికి సంబంధించిన ప్రక్రియ 15 రోజుల్లోగా పూర్తి కావాలని ఆదేశించారు.

ప్రతి ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల్లో మౌళిక వసతులు, వైద్యుల అందుబాటు, ప్రమాణాలతో కూడిన ఔషధాలు, శానిటేషన్‌, నాణ్యతతో కూడిన ఆహారం, ఆరోగ్యమిత్రలు కచ్చితంగా అమలవ్వాలని సీఎం జగన్ అన్నారు. అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల్లోనూ అవే ప్రమాణాలు పాటించాలని తెలిపారు. ఆరోగ్యమిత్రలు రోగులకు పూర్తి స్థాయిలో సేవలు అందించాలని పేర్కొన్నారు.  104 కాల్‌ సెంటర్‌ మరింత సమర్థంగా పని చేయాలని జగన్ సూచించారు. ఈ విషయాన్ని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని.. ప్రతి రోజూ తప్పనిసరిగా మాక్‌ కాల్స్‌ చేయాలని సీఎం తెలిపారు. ఫోన్‌ చేసిన అర గంటలో బెడ్ల కేటాయింపు జరగాలని, హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి మెడికల్‌ కిట్లు అందాలని, వైద్యులు, ఏఎన్‌ఎంలు వారికి అందుబాటులో ఉండాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Read More:

అలియా కోరిక ఓకే.. కానీ రాజమౌళి ఒప్పుకుంటారా..!

ప్రభాస్ ‘ఆదిపురుష్‌’.. శివుడిగా ఆ టాప్‌‌ హీరో..!