బాబు టార్గెట్‌గా విజయసాయి ట్వీట్.. ఈ సారి..!

YCP MP Vijaya Sai Reddy Slams Chandrbabu Naidu, బాబు టార్గెట్‌గా విజయసాయి ట్వీట్.. ఈ సారి..!

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు. గత కొద్ది రోజులుగా ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి టీడీపీ నేతలపై మండిపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని దేవాదాయ శాఖలో అన్యమత ఉద్యోగుల అంశంపై ట్విట్టర్‌లో స్పందించారు.

టీటీడీ, దేవాదాయ శాఖల్లో హిందూయేతర ఉద్యోగులు పనిచేయడాన్ని నిషేధిస్తూ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని.. మీరు చెప్పుకునే 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఇలాంటి సాహసోపేత నిర్ణయం ఎప్పుడైనా తీసుకున్నారా అంటూ ప్రశ్నించారు. మీరు కేవలం సెల్ఫ్ డబ్బా వాయించుకునే మనిషి మాత్రమేనని ఎద్దేవా చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదో ప్రజలకు వివరించాలని చంద్రబాబును డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *