మండలిని రద్దు చేయాల్సిందేనంటూ.. లోకేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైసీపీ నగరీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శాసన మండలి రద్దు అంశంపై స్పందిస్తూ.. పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మండలి రద్దు చేయాలని తాను సీఎం జగన్‌ను గట్టిగా కోరుతున్నానన్నారు. తెలుగుదేశం పార్టీ వైఖరి కారణంగానే శాసన మండలి విలువలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. మండలి గ్యాలరీల్లో కూర్చుని, చైర్మన్ ను బెదిరించి, తనకు అనుకూలంగా ఆయన వ్యవహరించేలా చంద్రబాబు చూశారంటూ రోజా ఆరోపించారు. ప్రభుత్వానికి […]

మండలిని రద్దు చేయాల్సిందేనంటూ.. లోకేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా..
Follow us

| Edited By:

Updated on: Jan 27, 2020 | 10:06 AM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైసీపీ నగరీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శాసన మండలి రద్దు అంశంపై స్పందిస్తూ.. పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మండలి రద్దు చేయాలని తాను సీఎం జగన్‌ను గట్టిగా కోరుతున్నానన్నారు. తెలుగుదేశం పార్టీ వైఖరి కారణంగానే శాసన మండలి విలువలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. మండలి గ్యాలరీల్లో కూర్చుని, చైర్మన్ ను బెదిరించి, తనకు అనుకూలంగా ఆయన వ్యవహరించేలా చంద్రబాబు చూశారంటూ రోజా ఆరోపించారు. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాల్సిన పెద్దల సభ.. ఇలా అభివృద్ధిని అడ్డుకుంటుంటే ఇక ఆ సభ ఉండాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

చంద్రబాబు రాయలసీమ ప్రాంతాన్ని సర్వనాశనం చేశారని, ఇప్పుడా ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు న్యాయ రాజధానిని పెడతామని చెబుతుంటే, అపహాస్యం చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే లోకేష్‌పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఆయన తీరు చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తోందని.. బయటకు వచ్చి, ఏదో సాధించేసినట్టు… శాసనమండలిని రద్దు చేస్తారా? దమ్ముంటే చేయండి అంటూ సవాల్ విసురుతున్నారన్నారు. బాగా బలిసిన కోడి.. చికెన్ షాపు ముందుకెళ్లి తొడగొడితే ఏమవుతుందండీ? కోసి ఉప్పూ, కారం పెట్టి, కూర వండేస్తారంటూ.. లోకేష్ సవాల్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

అటు యనమల రామకృష్ణుడిపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన్ను రెండుసార్లు, ఆయన తమ్ముడిని రెండు సార్లు ప్రజలు ఓడించారని అన్నారు. ప్రజలు జగన్‌కు అత్యధిక మెజారిటీని ఇచ్చారని.. 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని స్థాపించి కూడా, అభివృద్ధి పరమైన నిర్ణయాలను అమలు చేయలేకపోతే ఎలా అన్నారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుతగిలే దేన్నయినా కూడా పక్కకు తప్పించాల్సిందేనని రోజా వ్యాఖ్యానించారు.