Moon Mission: చంద్రుడిపై మానవులను పంపించే ముందు.. మొదలైన నాసా ఈ టెస్ట్‌ ప్లైట్‌తో ట్రయల్‌ రన్‌

 1960లో చందమామపైకి మానవ సహిత యాత్రలు నిర్వహించడానికి అమెరికా అపోలో ప్రాజెక్టును చేపట్టింది. అయితే నాడు సైన్స్‌ పరిశోధనల కోసం కాకుండా సోవియట్‌ యూనియన్‌పై పైచేయి సాధించడమే లక్ష్యంగా అగ్రరాజ్యం వీటిని నిర్వహించింది.

Moon Mission: చంద్రుడిపై మానవులను పంపించే ముందు.. మొదలైన నాసా ఈ టెస్ట్‌ ప్లైట్‌తో ట్రయల్‌ రన్‌
Nasa's Artemis 1 Moon Missi
Follow us

|

Updated on: Aug 29, 2022 | 11:02 AM

మరో చరిత్రాత్మక ఘట్టానికి నాసా శ్రీకారం చుట్టింది. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చంద్రుడిపైకి పంపే బృహత్తర కార్యక్రమానికి తొలి అడుగు పడింది. గతంలోలా కాకుండా జాబిలిపై శాశ్వత ఆవాసానికి పునాదులు వేస్తోంది.ఆర్టెమిస్‌-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్‌, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళతాయి. 1960లో చందమామపైకి మానవ సహిత యాత్రలు నిర్వహించడానికి అమెరికా అపోలో ప్రాజెక్టును చేపట్టింది. అయితే నాడు సైన్స్‌ పరిశోధనల కోసం కాకుండా సోవియట్‌ యూనియన్‌పై పైచేయి సాధించడమే లక్ష్యంగా అగ్రరాజ్యం వీటిని నిర్వహించింది. జాబిలిపైకి 1969లో మొదలైన మానవసహిత యాత్రలు 1972లో ముగిశాయి. ఏ యాత్రలోనూ వ్యోమగాములు మూడు రోజులకు మించి చందమామపై ఉండలేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. భూకక్ష్యకు వెలుపల లోతైన పరిశోధనలు చేయాలన్న ఆసక్తి పెరిగింది. చందమామ, అంగారకుడు, ఆ వెలుపలి ఖగోళ వస్తువులపై కాలనీల ఏర్పాటుకు పరిశోధకులు సిద్ధపడుతున్నారు.

ఇవాళ పంపే ఆర్టెమిస్‌-1 లో కమాండర్‌ సీటులో ఒక మనిషి బొమ్మ ఉంటుంది. దానికి ఫ్లైట్‌ సూట్‌ను తొడుగుతారు. రేడియో ధార్మికత నుంచి ఇది ఎంత మేర వ్యోమగామిని రక్షిస్తుందన్నది పరిశీలిస్తారు. ఇదే కాకుండా హెల్గా, జోహర్‌ అనే రెండు బొమ్మలు కూడా ఒరాయన్‌లో ఉంటాయి. మానవ కణజాలాన్ని సిమ్యులేట్‌ చేసే పదార్థంతో వీటిని తయారు చేశారు. ఇవి సుదూర అంతరిక్ష యాత్రలకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు చేస్తాయి.

ఆర్టెమిస్‌-1 యాత్ర ఆరు వారాల పాటు సాగుతుంది. ఫ్లోరిడాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఎస్‌ఎల్‌ఎస్‌ నింగిలోకి దూసుకెళుతుంది. నిర్దేశిత సమయం తర్వాత రాకెట్‌తో ఒరాయన్‌ విడిపోతుంది. చంద్రుడి దిశగా సాగే ట్రాన్స్‌ లూనార్‌ ఇంజెక్షన్‌ పథంలోకి వెళుతుంది.

మరిన్ని అంతర్జాతీయ  వార్తల కోసం