Joe Biden: ఆదిలోనే మాట తప్పిన బైడెన్ సర్కార్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైట్ హౌస్ ఉద్యోగులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

|

Mar 20, 2021 | 11:18 AM

Joe Biden: అమెరికాలో కొలువుదీని జో బైడెన్ సర్కార్.. ఆదిలోనే మాట తప్పిందట. హామీ ఇచ్చి.. ఇప్పుడు విస్మరించారట. ఇదే అంశంపై..

Joe Biden: ఆదిలోనే మాట తప్పిన బైడెన్ సర్కార్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైట్ హౌస్ ఉద్యోగులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Joe Biden
Follow us on

Joe Biden: అమెరికాలో కొలువుదీని జో బైడెన్ సర్కార్.. ఆదిలోనే మాట తప్పిందట. హామీ ఇచ్చి.. ఇప్పుడు విస్మరించారట. ఇదే అంశంపై వైట్ హౌస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. ఇంతకీ వైట్ హౌస్ ఉద్యోగుల ఆగ్రహానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బైడెన్ సర్కార్ తాజాగా ఐదుగురు వైట్ హౌస్ ఉద్యోగులను చెప్పాపెట్టకుండా తొలగించింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి ప్రకనట కూడా చేశారు. వీరిని ఎందుకు ఉద్యోగం నుంచి తీసేశారా? అని ఆరా తీస్తే అసలు విషయం వెలుగు చూసింది. తొలగింపునకు గురైన అధికారులు.. గతంలో గంజాయి, డ్రగ్స్ తీసుకున్నట్లు ప్రభుత్వం నిర్ధారించింది. ఆ కారణంగానే వారిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఈ చర్య ఇప్పుడు వైట్ హౌస్ ఉద్యోగులను ఆగ్రహానికి గురిచేసింది. వాస్తవానికి అమెరికా ఫెడరల్ చట్టాల ప్రకారం గంజాయి వాడకం నిషేధం. కానీ దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో గంజాయి వాడకం అనేది చట్టబద్ధత కలిగి ఉంది. దాంతో ఆయా రాష్ట్రాలకు చెంది.. వైట్‌హౌస్‌లో ఉద్యోగం చేస్తున్న వారు గంజాయిని తీసుకున్న సందర్భాలు ఎక్కువే ఉన్నాయి.

అయితే, ఇటీవల అమెరికాలో ఏర్పడిన జో బైడెన్ ప్రభుత్వం.. గతంలో గంజాయి తీసుకున్న వారిపై ఎలాంటి చర్యలూ ఉండబోమని, భవిష్యత్‌లో మాత్రం ఇలాంటి చర్యలకు పాల్పడొద్దంటూ వైట్ హౌస్ ఉన్నతాధికారులు.. ఉద్యోగులకు అనధికారికంగా చెప్పారు. ఇదే విషయాన్ని ఉద్యోగులు ప్రస్తావిస్తూ.. నాడు తొలగించమని చెప్పి, ఇప్పుడు చెప్పాపెట్టకుండా తీసేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీని కాదని, మాట మార్చడం సరికాదని అంటున్నారు.

అయితే, సిబ్బంది ఆరోపణలపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి స్పందించారు. మత్తు పదార్థాల వినియోగం పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపుతుందని బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది. ఆ కారణంగానే మత్తు పదార్థాల వినియోగంపై విచారణకు ఆదేశించామని, 100 మందిపై విచారణ చేపట్టి చివరికి ఐదుగురిని విధుల నుంచి తొలగించడం జరిగిందన్నారు. అయితే వీరు గంజాయితో పాటు మరో మత్తు పదార్థం కూడా తీసుకున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఆ కారణంగానే.. వారిని ఉద్యోగంలో నుంచి తొలగించినట్లు స్పష్టం చేశారు. ఏదేమైనా వైట్‌హౌస్ కేంద్రంగా చెలరేగిన ఈ వివాదం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ లైవ్ కింది వీడియోలో చూడొచ్చు..

Also read:

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో చోరీ.. విచారణలో దిమ్మతిరిగే నిజాలు.. భలే ప్లాన్ చేశారుగా..!

Fire Accident: శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైల్‌లో అగ్ని ప్రమాదం.. లగేజ్ కంపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు.. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది..