Watch Video: మలేషియాలో ఘోర ప్రమాదం.. గాల్లోనే ఢీ కొట్టుకున్న రెండు హెలికాఫ్టర్లు! పది మంది నేవీ సిబ్బంది మృతి

మలేసియాలో వచ్చే శుక్రవారం (ఏప్రిల్‌ 26) రాయల్‌ మలేసియన్‌ నేవీ దినోత్సవం జరగనుంది. ఈ క్రమంలో పెరక్‌లోని లుమత్‌ ప్రాంతంలో మంగళవారం రిహార్సల్స్‌ నిర్వహించారు. ఈ క్రమంలో గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కొద్ది క్షణాలకే ఒకదానికొకటి ఢీకొని కుప్పకూలాయి. వీటిల్లో విన్యాసాలు జరుగుతున్న ప్రాంతానికి పక్కనే ఉన్న స్టేడియంలో కూలిపోగా, మరొకటి స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయింది. ఈ ప్రమాదంలో రెండు..

Watch Video: మలేషియాలో ఘోర ప్రమాదం.. గాల్లోనే ఢీ కొట్టుకున్న రెండు హెలికాఫ్టర్లు! పది మంది నేవీ సిబ్బంది మృతి
Malaysian Navy Helicopters Crush
Follow us

|

Updated on: Apr 23, 2024 | 12:24 PM

కౌలాలంపూర్‌, ఏప్రిల్ 23: మలేసియాలో మంగళవారం (ఏప్రిల్‌ 23) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మలేషియా నేవీకి చెందిన రెండు హెలికాప్టర్లు గాలిలో ఢీకొన్నాయి. ఈ ఘటలో 10 మంది నౌకాదళం సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. సైనిక విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మలేషియ పశ్చిమ రాష్ట్రమైన పెరాక్‌లోని లుముట్ నేవల్ బేస్ వద్ద మంగళవారం ఉదయం 9.32 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు నౌకాదళం తెలిపింది

మలేసియాలో వచ్చే శుక్రవారం (ఏప్రిల్‌ 26) రాయల్‌ మలేసియన్‌ నేవీ దినోత్సవం జరగనుంది. ఈ క్రమంలో పెరక్‌లోని లుమత్‌ ప్రాంతంలో మంగళవారం రిహార్సల్స్‌ నిర్వహించారు. ఈ క్రమంలో గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కొద్ది క్షణాలకే ఒకదానికొకటి ఢీకొని కుప్పకూలాయి. వీటిల్లో విన్యాసాలు జరుగుతున్న ప్రాంతానికి పక్కనే ఉన్న స్టేడియంలో కూలిపోగా, మరొకటి స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయింది. ఈ ప్రమాదంలో రెండు హెలికాప్టర్లలో ఉన్న 10 మంది సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు లెఫ్టినెంట్‌ కమాండర్లు ఉన్నారు. హెలికాప్టర్లు కూలిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రెండు హెలికాప్టర్లు కూలిపోయే ముందు ఛాపర్స్ రోటర్‌లో ఒకటి మరొకటి ఢీకొనడం వీడియో క్లిప్‌లో చూడొచ్చు. ఈ ఫుటేజీ వాస్తవమేనని స్థానిక పోలీసులు నిర్ధారించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడతామని నౌకాదళం తెలిపింది. మరణించిన సిబ్బంది గుర్తింపు ధృవీకరించడానికి మృతదేహాలను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. వీరంతా 40 యేళ్లలోపు వారే.

ఇవి కూడా చదవండి

కాగా గత శనివారం జపాన్‌లోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఆ రోజు అర్ధరాత్రి వేళ ప్రత్యేక శిక్షణ నిమిత్తం బయల్దేరిన రెండు నేవీ హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొని సముద్రంలో కూలిపోయాయి. ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరో ఏడుగురు గల్లంతవగా ఇప్పటికీ వారి తెలియరాలేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
CBSC 10, 12 తరగతుల ఫలితాలపై కీలక అప్‌డేట్.. రిజల్ట్స్‌ తేదీ ఇదే!
CBSC 10, 12 తరగతుల ఫలితాలపై కీలక అప్‌డేట్.. రిజల్ట్స్‌ తేదీ ఇదే!
టీమిండియాకు మరోసారి భారీ షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా..
టీమిండియాకు మరోసారి భారీ షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా..
మ్యూచువల్ ఫండ్ ఖాతాదారులకు అలెర్ట్.. నామినేషన్ వల్ల లాభాలెన్నో.!
మ్యూచువల్ ఫండ్ ఖాతాదారులకు అలెర్ట్.. నామినేషన్ వల్ల లాభాలెన్నో.!
ఇదేం స్పీడ్ అన్నా.. నరాలు కట్.. గిన్నిస్ బుక్‌ ఎక్కేశాడు
ఇదేం స్పీడ్ అన్నా.. నరాలు కట్.. గిన్నిస్ బుక్‌ ఎక్కేశాడు
మీ ఇంట్లో ఉండే వాటితోటే పాదాలపై నలుపును ఇలా పోగొట్టండి..
మీ ఇంట్లో ఉండే వాటితోటే పాదాలపై నలుపును ఇలా పోగొట్టండి..
చిన్న వ్యాయామాలతో పెద్ద సమస్యకు చెక్‌.. అధ్యయనంలో తేలిన విషయాలు
చిన్న వ్యాయామాలతో పెద్ద సమస్యకు చెక్‌.. అధ్యయనంలో తేలిన విషయాలు
ఈ పాపం కొవి షీల్డ్‌దేనా ..
ఈ పాపం కొవి షీల్డ్‌దేనా ..
రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్‎కు కలిసొచ్చేనా? సీఎం రేవంత్ వ్యూహం ఇదే
రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్‎కు కలిసొచ్చేనా? సీఎం రేవంత్ వ్యూహం ఇదే
బంగారం కొనుగోలు చేస్తున్నారా..?కొనుగోలు సమయంలో ఈ జాగ్రత్తలు మస్ట్
బంగారం కొనుగోలు చేస్తున్నారా..?కొనుగోలు సమయంలో ఈ జాగ్రత్తలు మస్ట్
గొంతులో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. నోటి క్యాన్సర్ ఉన్నట్లే!
గొంతులో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. నోటి క్యాన్సర్ ఉన్నట్లే!