USA: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం.. ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న..

ఈ మేరకు బైడెన్‌ పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు లేఖ రాశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకోవడం డెమోక్రాట్లలో ఆందోళన నెలకొంది. అధ్యక్ష బరిలో ఎవరు నిలవనున్నారన్న దానిపై తీత్ర ఉత్కంఠ నెలకొంది. ఇక బైడెన్‌ రాసిన లేఖను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తన పూర్తి మద్ధతును కమలా హారిస్‌కు ఇస్తున్నానన్న బైడెన్‌ ఆమె అభ్యర్థిత్వానికి మద్ధతు ఇస్తున్నట్లు తెలిపారు...

USA: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం.. ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న..
Usa Elections
Follow us

|

Updated on: Jul 22, 2024 | 7:31 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలు మిగిలిన్న నేపథ్యంలో ఇప్పటికే పార్టీలు ప్రచారాన్ని మొదలు పెట్టాయి. ఇదిలా ఉంటే ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక సంఘటన చోటు చేసుకుంది. ముందు నుంచి అనుకుంటున్నట్లే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారు. పార్లీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు డెమోక్రటిక్‌ అభ్యర్థి బైడెన్‌ ఆదివారం ప్రకటించారు.

ఈ మేరకు బైడెన్‌ పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు లేఖ రాశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకోవడం డెమోక్రాట్లలో ఆందోళన నెలకొంది. అధ్యక్ష బరిలో ఎవరు నిలవనున్నారన్న దానిపై తీత్ర ఉత్కంఠ నెలకొంది. ఇక బైడెన్‌ రాసిన లేఖను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తన పూర్తి మద్ధతును కమలా హారిస్‌కు ఇస్తున్నానన్న బైడెన్‌ ఆమె అభ్యర్థిత్వానికి మద్ధతు ఇస్తున్నట్లు తెలిపారు. డెమోక్రాట్లు అందరూ కలిసి ట్రంప్‌ను ఓడించండి అంటూ బైడెన్‌ పిలుపునిచ్చారు. అధ్యక్ష రేసులో హారిస్‌ నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హారిస్‌తో పాటు మరో ముగ్గురు గవర్నర్‌ల పేర్లు కూడా తెర మీదికి వచ్చాయి. డెమోక్రాట్‌ పార్టీ నుంచి అధ్యక్ష రేసులో నిలిచేది ఎవరో ఆగస్టు 19 తర్వాత తెలిసే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను తన అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరిగిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఆయన వ్యవహారశైలి కూడా దీనికి కారణంగా చెప్పొచ్చు. ఇటీవల పలు సందర్భాల్లో బైడెన్‌ ప్రసంగాల్లో తడబడ్డారు. ఇక తాజాగా డైడెన్‌ కరోనా బారిన పడడంతో పాటు వృద్ధాప్య సమస్యలు కూడా తోడవ్వడంతో అధ్యక్ష రేసు నుంచి వైదొలగని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే తన హాయంలో అమెరికా నిర్మాణం కోసం ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని బైడెన్‌ తెలిపారు. వృద్ధులకు చౌకగా ఔషధాలను అందించడం, అమెరికన్లకు వైద్య చికిత్సలను అందుబాటులోకి తేవడం, గత 30 ఏళ్లలో తుపాకుల నుంచి రక్షణకు చట్టాన్ని చేయడం, సుప్రీంకోర్టుకు మొదటి అఫ్రో అమెరికన్‌ను నియమించడం, వాతావరణ మార్పులపై చట్టం తేవడం వంటివన్నీ తమ విజయాలనేనని బైడెన్‌ లేఖలో పేర్కొన్నారు.

కాగా బైడెన్‌ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడంపై ట్రంప్‌ స్పందించారు. దేశ చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్‌ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఒకవేళ అధ్యక్ష రేసులో కమలా హారిస్‌ నిలబడితే తాను మరింత సులభంగా విజయాన్ని సాధిస్తానని ట్రంప్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ట్రంప్‌పై దాడి జరగడం, ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం ట్రంప్‌ దూసుకుపోతుండడంతో పాటు బైడెన్‌ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడం వంటివన్నీ ట్రంప్‌నకు కలిసొచ్చే అంశాలుగా మారబోతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం.. బరిలో నుంచి తప్పుకున్న
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం.. బరిలో నుంచి తప్పుకున్న
కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన యువకుడు.. ఎక్స్‌రే తీసి చూడగా
కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన యువకుడు.. ఎక్స్‌రే తీసి చూడగా
గూగుల్ పిక్సెల్ 9 రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్చ్..!
గూగుల్ పిక్సెల్ 9 రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్చ్..!
ఏంది మచ్చా ఇది.. 1504 వికెట్లు తీసిన దిగ్గజాలకే దడ పుట్టించావ్
ఏంది మచ్చా ఇది.. 1504 వికెట్లు తీసిన దిగ్గజాలకే దడ పుట్టించావ్
మరికాసేపట్లో పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే.. రిలీజ్ చేసేది ఎవరంటే..?
మరికాసేపట్లో పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే.. రిలీజ్ చేసేది ఎవరంటే..?
Horoscope Today: ఆర్థిక లావాదేవీల విషయంలో ఆ రాశివారు జాగ్రత్త..
Horoscope Today: ఆర్థిక లావాదేవీల విషయంలో ఆ రాశివారు జాగ్రత్త..
బాత్ రూంలో అనుమానాస్పద మృతి.. రంగంలోకి క్లూస్ టీం..
బాత్ రూంలో అనుమానాస్పద మృతి.. రంగంలోకి క్లూస్ టీం..
వెండి ఆభరణాలకు మెరుగుపెట్టి.. ఆ పనిచేస్తూ దొరికిపోయిన మోసగాళ్లు..
వెండి ఆభరణాలకు మెరుగుపెట్టి.. ఆ పనిచేస్తూ దొరికిపోయిన మోసగాళ్లు..
తిరుపతిలో ఆ స్థానంపై కన్నేసిన టీడీపీ.. ఆయోమయంలో లోకల్ లీడర్లు..
తిరుపతిలో ఆ స్థానంపై కన్నేసిన టీడీపీ.. ఆయోమయంలో లోకల్ లీడర్లు..
ఈ వస్తువులు ఎవ్వరికీ ఇవ్వకూడదు.. వాస్తు శాస్త్రం ఇదే చెబుతోంది..
ఈ వస్తువులు ఎవ్వరికీ ఇవ్వకూడదు.. వాస్తు శాస్త్రం ఇదే చెబుతోంది..