కెనడా ఎన్నికల్లో అపూర్వ రికార్డు సృష్టించిన అభ్యర్థి
TV9 Telugu
30 June 2024
ప్రపంచంలో చాలా మంది పేరు మీద ఎన్నికల్లో భారీ రికార్డులు నమోదవుతుంటాయి. అలంటి విషయమే ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవల కెనడాలో జరిగిన టొరంటో-సెయింట్ ఉప ఎన్నికల్లో పోటీచేసిన ఓ వ్యక్తి అక్కడ ఆశ్చర్యకరమైన రికార్డు సృష్టించాడు.
టొరంటో-సెయింట్ పాల్ ఉప ఎన్నికలో కొన్ని రోజుల క్రితం ఓటింగ్ జరిగింది. ఇందులో ఓ సామాన్య వ్యక్తికి రికార్డు క్రియేట్ చేసారు.
45 ఏళ్ల ఫెలిక్స్-ఆంటోయిన్ హామెల్ అనే వ్యక్తి కెనడా ఉప ఎన్నికల్లో పోటీ చేశాడు. ఈ ఓట్లను లెక్కించినప్పుడు, హామెల్‌కు ఒక్క ఓటు కూడా రాలేదు.
కెనడాలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల చరిత్రలో పోటీ చేసిన అభ్యర్థికి ఇలా ఒక్క ఓటు కూడా రాకపోవడం ఇదే మొదటిసారి.
కెనడియన్ ఎన్నికలలో సున్నా ఓట్లు పొందిన మొదటి వ్యక్తిగా హామెల్ నిలిచాడు. ఈ విషయం తెలిసి హామెల్ సైతం నవ్వుకున్నాడు.
ఎన్నికల్లో ఇలా చరిత్రలో తన పేరు నమోదవుతుందని అస్సలు ఊహించలేదన్నారు ఉప ఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థి హామెల్.
ఫెలిక్స్-ఆంటోయిన్ హామెల్ టొరంటో నివాసి కాదని, అందువల్ల అతను తన ఓటును కూడా వేయలేకపోయాడని స్థానిక మీడియా పేర్కొంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి