చైనా పై గూఢచర్యంలో మాదే పైచేయి! ట్రంప్ సంచలన కామెంట్స్!

US, China Spy On Each Other : అమెరికా, చైనా మధ్య గూఢచర్యం జరుగుతోందా? ఈ ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవునని అంగీకరించారు. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకుంటున్నాయని,  గూఢచర్యంలో చైనా కంటే అమెరికానే చాలా తెలివిగా వ్యవహరిస్తోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఎన్విడియా అధినేత జెన్సన్ హువాంగ్ చుట్టూ ముసురుకున్న గూఢచర్యం వివాదంపై కూడా ట్రంప్ స్పందించారు. ఇంతకీ ఈ వ్యవహారంలో అసలేం జరుగుతోంది?

చైనా పై గూఢచర్యంలో మాదే పైచేయి! ట్రంప్ సంచలన కామెంట్స్!
Trump Says Us And China Spy On Each Other Claims America Has The Edge

Updated on: Nov 20, 2026 | 9:40 AM

US, China Spy On Each Other : అమెరికా, చైనా మధ్య గూఢచర్యం జరుగుతోందా? ఈ ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవునని అంగీకరించారు. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకుంటున్నాయని,  గూఢచర్యంలో చైనా కంటే అమెరికానే చాలా తెలివిగా వ్యవహరిస్తోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఎన్విడియా అధినేత జెన్సన్ హువాంగ్ చుట్టూ ముసురుకున్న గూఢచర్యం వివాదంపై కూడా ట్రంప్ స్పందించారు. ఇంతకీ ఈ వ్యవహారంలో అసలేం జరుగుతోంది?

ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా కొనసాగుతున్న అమెరికా, చైనా మధ్య పోటీ కేవలం వాణిజ్యం, టెక్నాలజీ, సైనిక రంగాలకే పరిమితం కాలేదు. ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకునే విషయంలోనూ ఈ రెండు దేశాల మధ్య పోటీ కొనసాగుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా అంగీకరించారు. చైనాలోని షెన్‌జెన్‌లో జరుగుతున్న ఏపీఈసీ సదస్సు సందర్భంగా ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.’మేం చైనాపై నిఘా పెడతాం.. వాళ్లు కూడా మాపై నిఘా పెడతారు. అయితే ఈ విషయంలో వాళ్ల కంటే మేమే మెరుగ్గా పనిచేస్తాం’, ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో రెండు దేశాల మధ్య గూఢచర్యం అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

జెన్సన్ హువాంగ్ చుట్టూ గూఢచర్యం వివాదం!

ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ముందు నుంచే మరో వ్యవహారం అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. చైనాకు చెందిన ఆలిస్ హువాంగ్ అనే మహిళతో ఆయనకు సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. జెన్సన్ హువాంగ్ తన భార్యకు ద్రోహం చేసిన విషయాన్ని అంగీకరించారు. ఎన్విడియా ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ ప్రారంభించింది. మరోవైపు, ఆలిస్ హువాంగ్‌కు చైనా భద్రతా మంత్రిత్వ శాఖతో ఉన్న సంబంధాలపై అమెరికా నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఈ గూఢచర్య ఆరోపణలను చైనా తోసిపుచ్చింది. అవన్నీ నిరాధారమైనవని స్పష్టం చేసింది.

అమెరికా ఏఐ అభివృద్ధి కార్యక్రమాలకు జెన్సన్ హువాంగ్ మద్దతు ఇస్తున్నారు. ఎన్విడియా తయారు చేసే అధునాతన ఏఐ చిప్‌లను చైనాకు విక్రయించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ట్రంప్ కూడా గతంలో సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు హువాంగ్ చుట్టూ గూఢచర్య ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు అమెరికా, చైనా మధ్య ఏఐ టెక్నాలజీ కోసం పోటీ.. మరోవైపు ఒకరిపై ఒకరు నిఘా ఆరోపణలు.. ఇంకోవైపు ప్రపంచ టెక్నాలజీ రంగంలో కీలక వ్యక్తిగా ఉన్న జెన్సన్ హువాంగ్ చుట్టూ వివాదం! ఈ మూడు పరిణామాలు ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us