Donald Trump: డోనల్డ్ ట్రంప్‌కు సమీపంలో మరోసారి కాల్పులు.. మాజీ అధ్యక్షుడు సురక్షితం

|

Sep 16, 2024 | 7:18 AM

అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం డోనాల్డ్ ట్రంప్‌ టార్గెట్‌గా కాల్పులు జరిపాడు ఓ వ్యక్తి. ఫ్లోరిడాలోని వెస్ట్‌పామ్‌ బీచ్‌ క్లబ్‌లో గోల్ఫ్‌ ఆడుతుండగా అతిసమీపం నుంచి ఫైరింగ్‌ సౌండ్స్‌ వినిపించాయ్‌. వెంటనే అలర్టయిన భద్రతా సిబ్బంది.. అగంతకుడిపై ఎదురుకాల్పులు జరిపారు. దాంతో, కారులో పారిపోయే యత్నం చేశాడు దుండగుడు. ఛేజ్‌చేసి అతడిని పట్టుకున్నారు సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్‌పై దర్యాప్తు జరుగుతోంది.

Donald Trump: డోనల్డ్ ట్రంప్‌కు సమీపంలో మరోసారి కాల్పులు.. మాజీ అధ్యక్షుడు సురక్షితం
Donald Trump
Follow us on

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మళ్లీ అటాక్ జరిగింది.. రెండునెలల క్రితం పెన్సిల్వేనియాలో ఆయనపై హత్యాయత్నం జరగ్గా.. వెంట్రుకవాసిలో మృత్యువు నుంచి తప్పించుకున్నారు. తాజాగా మరోసారి ఫ్లోరిడాలో ట్రంప్‌పై ఎటాక్‌ జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో తన గోల్ఫ్ క్లబ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా సమీపంలో కాల్పులు జరిగాయి. అప్రమత్తమైన యూఎస్ సీక్రెట్ సర్వీస్ పోలీసులు ట్రంప్‌ను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు.  హత్యాయత్నం చేసిన వ్యక్తి వాహనంలో పారిపోతుండగా పోలీసులు ఛేజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన నిందితున్ని 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్‌గా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు గుర్తించారు. ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న ప్రదేశానికి దగ్గరగా పొదల్లో నుంచి ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దుండగుడి దగ్గర రెండు బ్యాక్ ప్యాక్​లు కంచెకు వేలాడుతూ కనిపించాయని, ఒక గో-ప్రో కెమెరా కూడా ఉందని స్థానిక అధికారులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సీక్రెట్ సర్వీస్ అధికారులు. ఘటన వెనుక కారణాలపై దర్యాప్తు చేపట్టారు.మరోవైపు డొనాల్డ్​ ట్రంప్​పై కాల్పులకు పాల్పడిన రౌత్​ 2002లో సామూహిక విధ్వంసక ఆయుధాన్ని కలిగి ఉన్నాడన్న అంశంలో దోషిగా తేలాడు.

జులై నెలలో కూడా ట్రంప్‌పై కాల్పులు జరిగాయ్‌. పెన్సిల్వేలియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతుండగా.. ట్రంప్‌పై కాల్పులు జరిపాడు థామస్‌ మాథ్యూ క్రూక్స్‌. ట్రంప్‌ కుడి చెవి పైభాగం నుంచి దూసుకెళ్లింది తూటా. అప్పుడు వెంట్రుకవాసిలో మృత్యువు నుంచి తప్పించుకున్నారు ట్రంప్‌. అయితే, ఇప్పుడు మళ్లీ కాల్పులు జరగడంతో మరోసారి కలకలం రేగుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..