Kartarpur: బ్రిటిష్ న్యాయవాది చేసిన తప్పిదం.. పాకిస్తాన్ లో ఉండిపోయిన గురుద్వారా.. కర్తార్‌పూర్ కథ మీకు తెలుసా?

|

Nov 17, 2021 | 1:54 PM

కర్తార్‌పూర్ కారిడార్ బుధవారం నుంచి మళ్ళీ ప్రారంభం అయింది. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది మార్చి 16 నుండి దీనిని మూసివేశారు.

Kartarpur: బ్రిటిష్ న్యాయవాది చేసిన తప్పిదం.. పాకిస్తాన్ లో ఉండిపోయిన గురుద్వారా.. కర్తార్‌పూర్ కథ మీకు తెలుసా?
Kartarpur Corridor And Gurudwara
Follow us on

Kartarpur: కర్తార్‌పూర్ కారిడార్ బుధవారం నుంచి మళ్ళీ ప్రారంభం అయింది. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది మార్చి 16 నుండి దీనిని మూసివేశారు. దేశ విభజన సమయంలో ఒక ఆంగ్ల న్యాయవాది తప్పిదం వల్ల కర్తార్‌పూర్ గురుద్వారా పాకిస్థాన్‌కు వెళ్లిపోయింది. నిర్లక్ష్యం, యుద్ధ దాడుల కారణంగా శిథిలావస్థకు చేరుకుంది. ప్రజలు ఇక్కడ పశువులను కట్టడం ప్రారంభించారు, కానీ 90వ దశకంలో, పాకిస్తాన్ ప్రభుత్వం దానిని బాగు చేయాలని నిర్ణయించుకుంది. ఈ గురుద్వారా చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకుందాం.

కర్తార్‌పూర్ గురుద్వారా చరిత్ర ఇదీ..

కర్తార్‌పూర్ సాహిబ్ పాకిస్థాన్‌లోని నరోవల్ జిల్లాలో రావి నదికి సమీపంలో ఉంది. దీని చరిత్ర 500 సంవత్సరాలకు పైగా ఉంది. దీనిని 1522లో సిక్కుల గురునానక్ దేవ్ స్థాపించారని నమ్ముతారు. ఆయన తన జీవితంలో చివరి సంవత్సరాలు ఇక్కడ గడిపాడు.

రావి నది ప్రవాహాన్ని సరిహద్దుగా భావించడంతో..

లాహోర్ నుండి కర్తార్‌పూర్ సాహిబ్‌కి దూరం 120 కి.మీ. అదే సమయంలో, ఇది పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ ప్రాంతంలో భారత సరిహద్దు నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. లారీ కాలిన్స్.. డొమినిక్ లాపియర్ రాసిన ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ పుస్తకం ప్రకారం, ఆంగ్ల న్యాయవాది సర్ క్రిల్ రాడ్‌క్లిఫ్‌కు విభజన మ్యాప్‌ను గీయడానికి రెండు నెలల కన్నా తక్కువ సమయం ఉంది. భారతదేశం భౌగోళిక స్థానం గురించి ఆయనకు ఏమీ తెలియదు. అలాంటి పరిస్థితిలో రావి నదిని మాత్రమే సరిహద్దుగా చేసుకున్నాడు. కర్తార్‌పూర్ గురుద్వారా రవికి అవతలి వైపు ఉంది, కాబట్టి అది పాకిస్తాన్‌లోని భాగానికి వెళ్ళింది.

ఇండో-పాక్ యుద్ధం కారణంగా గురుద్వారా చాలా నష్టపోయింది.

ఈ గురుద్వారా 1965, 71 యుద్ధాలలో చాలా నష్టపోయింది. 90ల నాటికి, దాని భవనం బాగా క్షీణించింది. ప్రజలు ఇక్కడ పశువులను కట్టడం ప్రారంభించారు. ప్రజలు దాని చరిత్రను కూడా మరిచిపోయారు. దీని ప్రాముఖ్యత తెలిసిన భారతీయులు, కొంతమంది మాత్రమే ఇక్కడికి వెళ్లేవారు. వారు కూడా వాఘా సరిహద్దు గుండా వెళ్లాల్సి వచ్చింది.

ఇరు దేశాల ప్రభుత్వాల కృషితో..

1998 తర్వాత, పాకిస్తాన్ ప్రభుత్వం గురుద్వారాపై దృష్టి పెట్టింది. 1999లో, దానిని మరమ్మత్తు చేయాలనే డిమాండ్ మొదలైంది. అప్పుడు పాకిస్తాన్ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ గురుద్వారాను బాగుచేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఆ తర్వాత ఏళ్ల తరబడి నిర్మాణ పనులు కొనసాగాయి. గురుదాస్‌పూర్‌లోని డేరా బాబా నానక్‌ను, పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న పవిత్ర గురుద్వారాను కలుపుతూ ఒక కారిడార్‌ను నిర్మించాలని తరువాత భారతదేశం, పాకిస్తాన్ ప్రభుత్వాలు నిర్ణయించాయి. కారిడార్ పునాది రాయి భారతదేశంలో 26 నవంబర్ 2018న.. పాకిస్తాన్‌లో 28 నవంబర్ 2018న వేశారు. కారిడార్ నిర్మాణ పనుల అనంతరం దీనిని గురునానక్ దేవ్ జీ జయంతి సందర్భంగా 9 నవంబర్ 2019న ప్రజలకు అంకితం చేశారు.

ఇవి కూడా చదవండి: Onion Face Pack: ఉల్లిపాయ ఫేస్‌ప్యాక్.. ఇలా చేస్తే తళుక్కుమనే అందం మీ సొంతం..

Thyroid Disease: మహిళలకు థైరాయిడ్‌ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!

Parenting Tips: గుక్కపెట్టి ఏడిచే సమయంలో.. చిన్నారుల శరీరం నీలం రంగులోకి మారుతుందా.? దీనికి కారణమేంటో తెలుసా..