Sri Lanka Crisis: కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం.. వెనక్కి తగ్గని నిరసనకారులు..

|

Jul 21, 2022 | 12:05 PM

 శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రాజధాని కొలంబోలో మళ్లీ ప్రదర్శనలు జోరందుకున్నాయి.

Sri Lanka Crisis: కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం.. వెనక్కి తగ్గని నిరసనకారులు..
Ranil Wickremesinghe Sworn
Follow us on

కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్న తర్వాత కూడా శ్రీలంకలో ఆందోళనలు చల్లారేలా కనిపించడం లేదు. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రాజధాని కొలంబోలో మళ్లీ ప్రదర్శనలు జోరందుకున్నాయి. నిరసనకారులు రణిల్ విక్రమసింఘేను వ్యతిరేకిస్తున్నారు. విక్రమసింఘే గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేస్తారని.. ఆ రోజు తర్వాత కొత్త ప్రధానిని నియమిస్తారని అధ్యక్ష కార్యాలయ అధికారులు జిన్హువా వార్తా సంస్థతో తెలిపింది. జూలై 20 బుధవారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో రణిల్ విక్రమసింఘేకు 134 మంది ఎంపీల ఓట్లు రావడం గమనార్హం. రహస్య బ్యాలెట్ ద్వారా పార్లమెంటు ఓటింగ్‌లో గెలిచిన వెంటనే, విక్రమసింఘే పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంకను బయటకు తీసుకురావడానికి ప్రతిపక్ష చట్టసభ సభ్యులతో సహా అందరు శాసనసభ్యులు ఏకం కావాలని.. కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. విక్రమసింఘే మాట్లాడుతూ, “మేము క్లిష్ట దశలో ఉన్నాం. ఆర్థిక సంక్షోభం ఉంది. యువత వ్యవస్థలో మార్పును కోరుకుంటున్నారు. ప్రజలు ఎంపీలందరూ కలిసి రావాలని కోరుకుంటున్నారు” అని అన్నారు.

225 మంది ఎంపీలలో 223 మంది ఎంపీలు ఓట్లు

ఇవి కూడా చదవండి

కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు 223 మంది ఓటు వేశారు. నాలుగు ఓట్లు చెల్లలేదు. మిగతా ఇద్దరు అభ్యర్థులు, శ్రీలంక పొదుజన పెరమున పార్టీ ఎంపీ డల్లాస్ అలహప్పెరుమకు 82 ఓట్లు రాగా.. నేషనల్ పీపుల్స్ పవర్ నాయకుడు అనుర కుమార దిసానాయకేకు కేవలం మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి.

శ్రీలంక రాజకీయాలకు విక్రమసింఘే కొత్తేమి కాదు. గతంలో ఆరుసార్లు శ్రీలంక ప్రధానిగా పనిచేశారు. హౌస్‌లోని సభ్యులు రహస్య బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన అధ్యక్ష ఎన్నికలకు అతను అగ్రస్థానంలో నిలిచారు.

రాజపక్సే రాజీనామా తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా మారిన విక్రమసింఘే.. 

దేశంలోని అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైన తరువాత.. ప్రజలు వీధుల్లోకి వచ్చి అధ్యక్ష నివాసంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే దేశం విడిచి పారిపోయి. రాజకీయ గందరగోళ వాతావరణం మధ్య అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీని తర్వాత విక్రమసింఘే శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

అంతర్జాతీయ వార్తల కోసం..