Nigeria zoo: ఆహారం అందిస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న జూ కీపర్.. పెంచిన సింహం చేతిలో హతం

|

Feb 21, 2024 | 12:15 PM

జంతుప్రదర్శనశాల బాధ్యత తీసుకున్న ఒలాబోడే ఒలావుయి( Olabode Olawuyi) సోమవారం సింహాలకు ఆహారం ఇస్తుండగా అతడిపై దాడి చేసింది. అతడిని రక్షించడానికి అతని సహచరులు ఎంతగానో ప్రయత్నించారు. అయినప్పటికే సింహం అతని తీవ్రంగా గాయపరచడంతో వారు ఏ విధంగా సహాయం అందించలేకపోయారు. అక్కడ ఉన్న సింహాలలో ఒకటి జుకీపర్ ను  తీవ్రంగా గాయపరిచిందని విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Nigeria zoo: ఆహారం అందిస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న జూ కీపర్.. పెంచిన సింహం చేతిలో హతం
Nigeria Zookeeper
Follow us on

దాదాపు దశాబ్ద కాలంగా సింహాలను సంరక్షిస్తున్న జూకీపర్‌పై దాడి చేసి సి చంపేసింది ఓ సింహం. ఈ దారుణ ఘటన నైజీరియాలో చోటు చేసుకుంది. ఒసున్ రాష్ట్రంలోని ఒబాఫెమి అవోలోవో యూనివర్శిటీ జంతుప్రదర్శనశాలో జూకీపర్ ఒలాబోడే ఒలావుయి సింహాలకు ఆహారాన్ని అందిస్తుండగా జరిగింది. BBC ప్రకారం జంతుప్రదర్శనశాల బాధ్యత తీసుకున్న ఒలాబోడే ఒలావుయి( Olabode Olawuyi) సోమవారం సింహాలకు ఆహారం ఇస్తుండగా అతడిపై దాడి చేసింది. అతడిని రక్షించడానికి అతని సహచరులు ఎంతగానో ప్రయత్నించారు. అయినప్పటికే సింహం అతని తీవ్రంగా గాయపరచడంతో వారు ఏ విధంగా సహాయం అందించలేకపోయారు. అక్కడ ఉన్న సింహాలలో ఒకటి జుకీపర్ ను  తీవ్రంగా గాయపరిచిందని విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటన తర్వాత ఆ సింహాన్ని జూ సిబ్బంది కాల్చి చంపారు మిస్టర్ ఒలావుయి వెటర్నరీ టెక్నాలజిస్ట్. తొమ్మిదేళ్ల క్రితం క్యాంపస్‌లో పుట్టిన సింహం  బాధ్యతను, దాని వాటి సంరక్షణను తీసుకున్నాడు.

“చివరకు అతని జీవితం విషాదకరంగా ముగిసింది. జూలో మగ సింహానికి ఆహారం అందిస్తుందా దాడి చేసి చంపేసింది. ఈ ఘటనపై యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్, ప్రొఫెసర్ అడెబాయో సిమియోన్ బమిరే స్పందిస్తూ  తాను ఈ ఘటన , వ్యక్తి మరణం దారుణం అని చెప్పారు. సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినట్లు చెప్పారు.

ఇదే విషయంపై స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు అబ్బాస్ అకిన్రేమి స్పందిస్తూ దురదృష్టకరమని చెప్పారు. జూకీపర్ సింహాలకు ఆహారం ఇచ్చిన తర్వాత తలుపు తాళం వేయడం మరచిపోవడంతో “మానవ తప్పిదం” వల్ల దాడి జరిగిందని అన్నారు. మిస్టర్ అకిన్రేమి కూడా మిస్టర్ ఒలావుయికి నివాళులర్పించారు.

ఉత్తర నైజీరియాలోని కానోలోని జూలో 50 ఏళ్లకు పైగా సింహాలకు ఆహారం అందిస్తున్న అబ్బా గండు కూడా ఈ ఘటనను దురదృష్టకరమని, మరిన్ని భద్రతా చర్యలు అవసరమని పేర్కొన్నాడు. “ఈ సంఘటన నన్ను వ్యక్తిగతంగా ప్రభావితం చేయదు, ఎందుకంటే నేను చనిపోయే వరకు సింహాలకు ఆహారం అందిస్తూనే ఉంటానని గండు అన్నారు.అంతేకాదు సింహానికి ఆహారం అందిస్తున్న సమయంలో తన వేలుని కొరకడం తన జీవితంలో అతి చెత్త అనుభవం అని గుర్తు చేసుకున్నారు.

ఈ సంఘటనతో యూనివర్సిటీ వర్గాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. BBC ప్రకారం, మిస్టర్ ఒలావుయి కుటుంబానికి వారి సంతాపాన్ని తెలియజేయడానికి ఒక ప్రతినిధి బృందం కూడా వెళ్ళింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..