ఎంతకు తెగించావ్‌రా.. మద్యం మత్తులో ఉన్న మహిళను భుజాలపై ఎత్తుకెళ్లి.. చివరకు రూమ్‌లో..

Indian-Origin Student: ఆమెవరో ఇతనికి తెలియదు.. ఇతనెవరో ఆమెకు తెలియదు.. కానీ, ఇద్దరూ ఒకే నైట్ క్లబ్ కు వెళ్లారు.. ఆమెకు మద్యం ఎక్కువైంది.. దీంతో ఇతను ఆమెపై కన్నేశాడు.. ఆమెను తీసుకుని ఏకంగా రూమ్ కి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఎంతకు తెగించావ్‌రా.. మద్యం మత్తులో ఉన్న మహిళను భుజాలపై ఎత్తుకెళ్లి.. చివరకు రూమ్‌లో..
Uk Crime News

Updated on: Jun 18, 2023 | 5:18 PM

Indian-Origin Student: ఆమెవరో ఇతనికి తెలియదు.. ఇతనెవరో ఆమెకు తెలియదు.. కానీ, ఇద్దరూ ఒకే నైట్ క్లబ్ కు వెళ్లారు.. ఆమెకు మద్యం ఎక్కువైంది.. దీంతో ఇతను ఆమెపై కన్నేశాడు.. ఆమెను తీసుకుని ఏకంగా రూమ్ కి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన యూకే ఇంగ్లాండ్ లో చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి మహిళపై దారుణానికి ఒడికట్టగా.. స్థానిక న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన ఏడాది క్రితం జరగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంగ్లాండ్ లోని కార్డిఫ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత సంతతికి చెందిన ప్రీత్‌ వికల్‌ అనే 20 ఏళ్ల విద్యార్తి సౌత్‌వేల్స్‌లోని కార్డిఫ్‌ ప్రాంతంలో ఉంటున్నాడు. అయితే, గత ఏడాది జూన్‌ లో అతడు ఓ నైట్‌ క్లబ్‌కు వెళ్లాడు. అదే సమయంలో ఓ మహిళ కూడా మరికొంతమందితో కలిసి అదే క్లబ్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరూ అక్కడ కలుసుకున్నారు. క్లబ్‌లో ఆ మహిళ మద్యం ఎక్కువగా తాగింది. ఆమె మత్తులో ఉండగా.. వికల్‌, ఆ మహిళ ఇద్దరూ బయటకి వచ్చారు. ఆ తర్వాత వికల్‌ ఆమెను తన రూమ్‌కి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

వికల్ నైట్ క్లబ్ నుంచి యువతిని తీసుకెళ్తున్న దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మొదట మహిళను తన చేతులపై తీసుకెళ్లిన యువకుడు.. ఆ తర్వాత ఆమెను భుజాలపై ఎత్తుకుని తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో మహిళలపై ఇలాంటి దాడులు జరగడం చాలా అరుదని.. ప్రీత్‌ వికల్‌ ఓ ప్లాన్ ప్రకారం మహిళను తీసుకెళ్లి రేప్ చేసినట్లు వెల్లడించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని.. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించిందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..