ఏలియన్స్‌ ఉంటే కచ్చితంగా మనల్ని చూస్తూనే ఉంటారు!లీసా కాల్టేనెగర్‌ వివరణ :Aliens.

|

Jun 26, 2021 | 1:51 PM

అనంతానంత విశ్వంలో కోటాను కోట్ల నక్షత్రాలు.. లెక్కలేనన్ని సౌరకుటుంబాలు. ఒక్కో సౌర కుటుంబంలో పదుల సంఖ్యలో గ్రహాలు.. వాటి చుట్టూ తిరుగుతూ ఉపగ్రహాలు. అందులో ఒకటి మనం నివసిస్తున్న భూమి. ఆ భూమిపై లక్షల కొద్ది సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్న మనం .

ఏలియన్స్‌ ఉంటే కచ్చితంగా మనల్ని చూస్తూనే ఉంటారు!లీసా కాల్టేనెగర్‌ వివరణ :Aliens.
If Aliens Exist In These 1,700 Solar Systems, They Can Probably See Earth
Follow us on

అనంతానంత విశ్వంలో కోటాను కోట్ల నక్షత్రాలు.. లెక్కలేనన్ని సౌరకుటుంబాలు. ఒక్కో సౌర కుటుంబంలో పదుల సంఖ్యలో గ్రహాలు.. వాటి చుట్టూ తిరుగుతూ ఉపగ్రహాలు. అందులో ఒకటి మనం నివసిస్తున్న భూమి. ఆ భూమిపై లక్షల కొద్ది సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్న మనం . అంతు తెలియని విశ్వాంతరాళంలో మనం తప్ప ఇంకెవరూ లేరా? మనలాంటి జీవులు ఇంకెక్కడైనా వున్నారా? అంటే మాత్రం కచ్చితంగా వుండే వుంటారన్న సమాధానం వస్తుంది. జీవానికి అనువైన గ్రహాలు బోలెడన్నీ వుండి వుంటాయి…వాటిల్లో మనలాంటి జీవులు వుండే వుంటారు. కొందరు మనకంటే తెలివిమీరి మనకంటే వేలకొద్ది సంవత్సరాల ముందుండి ఉంటారు. కొందరు ఇంకా ఆది మానవుల దశలోనే ఉండి ఉంటారు. మానవులు అనే ప్రయోగం తప్పు కావచ్చు.. ఎందుకంటే వేరే గ్రహాలలో ఉండేవారు మనలా , మనుషుల్లా ఉండరేమో!

ఇప్పటి వరకు మనకంటె తెలివైన వారు లేరనే ఊహల్లో వున్నాం. మానవుడే మహనీయుడని మనకు మనమే కీర్తించుకుంటున్నాం. అందుకే మన అన్వేషణ అంతా తెలియని జీవుల గురించే. గ్రహాంతర జీవులంటూ వుంటే వాళ్ల శరీరాలు మన శరీరాల్లా మాత్రం వుండవు. మనకు వాళ్లకు చాలా తేడా వుంటుంది. ఆ తేడా మనిషి మెదడుకు అందని స్థాయిలో వుండవచ్చు. మనకుండే అవయవాలు ఇంద్రియాలే అక్కడి జీవాలకు ఉండాలని రూలు కూడా లేదు. మనకు ఒకే ఒక్క మెదడుంటే వాళ్లకి రెండు మెదళ్లు వుండవచ్చు. మనకు తెలియని అవయవాలుండవచ్చు. మనం ఊహించని అవయవాలుండవచ్చు. మనం ఊహించలేని విధంగా వాళ్లు తమ అవయవాల్ని ఉపయోగిస్తూ వుండవచ్చు. మనిషి వినగలడు. చూడగలడు. వాసనను పసికట్టగలడు. స్పర్శను అనుభవించగలడు. రుచిని పట్టేయగలడు.. అంటే మనిషికి అయిదు ఇంద్రియాలే తెలుసు. ఏలియన్స్‌కి ఇవి కాకుండా ఇంకొన్ని గుణాలు. శక్తులు తెలిసివుండవచ్చు.. అవి ఏమిటో ఎలాంటివో మనం గుర్తించకపోవచ్చు. ఈ లెక్కన ఒకవేళ గ్రహాంతర జీవులు మన దగ్గరికి వచ్చినా మనం వాళ్లని గుర్తుపట్టలేమేమో! మన దగ్గరే మెసలుతున్నా పట్టుకోలేమేమో! అసలు ఇంతకాలం ఎలియన్స్‌ ఆచూకిని తెలివిమీరిన మనిషి కనిపెట్టకపోవడానికి ఇదే కారణం కావచ్చు.

గ్రహాంతరజీవులు ఉన్నారని మనం గట్టిగా నమ్ముతున్నాం. గ్రహరాశులనధిగమించి ఘనతారల పథము నుంచి గగనాంతర రోదసిలో తిరుగాడుతున్న మనకు ఏలియన్స్‌ ఇప్పటికీ ఇది అంతు చిక్కని రహస్యంగానే ఉండిపోయింది. మన పిచ్చి కాకపోతే మనం ఏలియన్స్‌ కోసం ఎలా వెదుకుతున్నామో ..కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కొందరు మనం కోసం అలాగే వెతుకుతుంటారు కదా! మనల్ని , మన చర్యలను పరిశీలిస్తూ ఉండారు కదా! అమెరికా పరిశోధనలో ఇప్పుడు తేలింది ఇదే! మన బుద్ధి వికసించినప్పటి నుంచే ఏలియన్స్‌ ఉనికి కోసం అన్వేషణ మొదలుపెట్టాం.. దాదాపుగా ఎనిమిది దశాబ్దాల నుంచి ఇదే పనిలో ఉన్నాం.. 1940 నుంచి అంతరిక్షంలోకి శక్తివంతమైన రేడియో, విద్యుదయస్కాంత తరంగాలను పంపిస్తున్నాం.. ఇప్పటికిప్పుడు మన సిగ్నళ్లకు ఏలియన్స్‌ స్పందించినా , వారిచ్చే జవాబు మనకు అందడానికి 80 ఏళ్లు పడుతుంది.. అలాగని మనం పంపించిన రేడియో సిగ్నల్స్‌ వాళ్లకు కచ్చితంగా అందుతాయన్న గ్యారంటీ కూడా లేదు.. కాకపోతే అంతరిక్షం నుంచి చాలా సార్లు గుర్తు తెలియని సిగ్నల్స్‌ వచ్చాయి.. శాస్త్రవేత్తలు వాటిని గుర్తించారు. వాటిని ఏలియన్సే పంపి ఉంటారని అనుకుంటున్నారు. సెర్చ్‌ ఫర్‌ ఎక్స్‌ట్రా టెరిస్ర్టియల్‌ ఇంటెలిజెన్స్‌…క్లుప్తంగా సెటి…ఇతర గ్రహాల్లో మనలాంటి బుద్ధి జీవుల కోసం అలుపెరుగని అన్వేషణ.. బుద్ధి పెరిగినప్పట్నుంచి మనిషి వెతుకులాట. ఎలియన్స్‌ అదే గ్రహాంతర వాసుల జాడను కనిపెట్టాలనే తపన. ఇప్పటి వరకు అలాంటి జీవుల జాడ గురించి స్పష్టంగా తెలియకపోయినా తప్పకుండా వుంటారనేది సైంటిస్టుల భావన..

భూమి మీద ఉన్నట్టుగానే కోట్లాది నక్షత్ర మండలాలలోని గ్రహాలలో జీవం ఉండవచ్చని అమెరికాలోని కార్నెల్‌ కార్ల్ సగన్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ లీసా కాల్టేనెగర్‌ భావన! ఆమెదే కాదు చాలా మంది అభిప్రాయం కూడా ఇదే! సూర్య కుటుంబం ఉన్న పాలపుంత గెలాక్సీకి 326 కాంతి సంవత్సరాల దూరం పరిధిలో రెండు వేలకుపైగా నక్షత్ర మండలాలు ఉన్నట్టు ఆమె అంటున్నారు. అయిదు వేల సంవత్సరాల కిందటి నుంచే మనిషి ఖగోళంపై ఆసక్తి పెంచుకున్నాడు. గ్రహాలను లెక్కించాడు. సూర్యుడు కేంద్రంగా గ్రహాలన్నీ తిరుగుతున్నాయని తెలుసుకున్నాడు. ఆ నాటి నుంచే సుమారు 1,715 నక్షత్ర మండలాలు ఎర్త్‌ ట్రాన్సిట్‌ జోన్‌ పరిధిలోకి వచ్చాయని లీసా కాల్టేనెగర్‌ అంటున్నారు. ఎర్త్‌ ట్రాన్సిట్‌ జోన్‌ అంటే గ్రహాన్ని గుర్తించేందుకు అవసరమైన దూరమన్నమాట! ఈ నక్షత్ర మండలాల్లో వేలాది గ్రహాలు ఉన్నాయనీ, అందులో అందులోని 29 గ్రహాలు నీరు, రాళ్లతో నిండి ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. నీరు గాలి ఉంటే జీవం ఉండే ఉంటుంది.. ఆ జీవులు మనకంటే మహా మేథస్సు కలవారు అయి ఉంటే మాత్రం భూమి మీద ఉన్న మనల్ని గమనిస్తూనే ఉంటారు. మనం వారిని ఏలియన్స్‌ అని ఎలా అంటున్నామో.. వారు మనల్ని అలాగే పిలుస్తారు. ట్రాన్సిట్‌ పద్దతి ద్వారా ఈ అంచనాకు వచ్చామని లీసా అంటున్నారు. ట్రాన్సిట్‌ పద్దతి అంటే నక్షత్రం చుట్టూ గ్రహ భ్రమణం, గ్రహ వ్యాసం, ఆ గ్రహ వాతావరణం, ఇతర వివరాలను తెలుసుకునేందుకు ఉపయోగించే సాంకేతికత. గ్రహాంతర జీవులు మనకంటే సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందిన వారైతే తప్ప మనల్ని గమనించే వీలు లేదని అమెరికన్‌ మ్యూజియమ్‌ ఆఫ్‌ నేచర్‌ హిస్టరీ డైరెక్టర్‌ జాకీ ఫహెర్టీ అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: బిల్లు మూడు వేలు..టిప్పు 12 లక్షలు..!షాక్ అయినా వెయిటర్..షాక్ ఇచ్చిన కస్టమర్ :$16000 tip video.

పాన్‌ ఇండియా చిత్రాల న‌యా ట్రెండ్.. ప్ర‌భాస్‌కూడా అదే బాట‌లో.?రెండు పార్ట్ లుగా ?:Prabhas Salaar movie video.

మూడు చేపలకు పేర్లు పెట్టేందుకు వేలంపాట నిర్వహణ..!4 మిలియన్ డాలర్లు లక్ష్యం :3 beluga whales video.

ఎంతో ఇష్టపడి కొనుకున్న హీరోయిన్ సౌందర్య ఇల్లు..శిధిలావస్థ భూతు బంగ్లా లా తయారైన హౌస్ :Soundarya House video.