GoldFish: సరస్సులను నాశనం చేస్తున్న గోల్డ్ ఫిష్.. వాటిని చెరువులలో వదలవద్దని అధికారుల వేడికోలు!

| Edited By: KVD Varma

Jul 13, 2021 | 11:43 AM

GoldFish: ఇంట్లో మనం సరదాగా ఎక్వేరియంలో పెంచుకునే గోల్డ్ ఫిష్ తో పెద్ద సమస్య వచ్చిపడిందని చెబుతున్నారు మిన్నెసోటా దేశంలోని అధికారులు.

GoldFish: సరస్సులను నాశనం చేస్తున్న గోల్డ్ ఫిష్.. వాటిని చెరువులలో వదలవద్దని అధికారుల వేడికోలు!
Goldfish
Follow us on

GoldFish: ఇంట్లో మనం సరదాగా ఎక్వేరియంలో పెంచుకునే గోల్డ్ ఫిష్ తో పెద్ద సమస్య వచ్చిపడిందని చెబుతున్నారు మిన్నెసోటా దేశంలోని అధికారులు. అక్కడి ప్రజలు తాము పెంచుకునే గోల్డ్ ఫిష్ ను కొంతకాలం తరువాత అక్కడి జలమార్గాలలో ప్రజలు వదిలివేస్తున్నారు. దీంతో అక్కడ సమస్య ఏర్పడిందని వారంటున్నారు. స్థానిక సరస్సులో ఈ విధంగా గోల్డ్ ఫిష్ లను వదిలి వేయడంతో సరస్సులోని నీరు పాడైపోతోందని అధికారులు ప్రజలకు చెబుతూ వస్తున్నారు. ఈ విషయంపై వారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో గోల్డ్ ఫిష్ లను సరస్సులో విడిచి పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు.

మిన్నెసోటాలోని ప్రజలు తాము పెంచుకుంటున్న గోల్డ్ ఫిష్ లను కొంతకాలం తరువాత స్థానికంగా ఉన్న సరస్సులో వదిలివేస్తున్నారు. మిన్నియాపాలిస్కు దక్షిణాన 15 మైళ్ళ దూరంలో ఉన్న బర్న్స్ విల్లెలో ఇలా చేస్తున్నారు. అక్కడి అధికారులు ఈవిధంగా చేయవద్దని ప్రజలను కోరుతున్నారు. ప్రజలు ఇక్కడ సరస్సులో వదిలిపెట్టిన గోల్డ్ ఫిష్ వాటి సాధారణ పరిమాణానికి చాలా రెట్లు పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ఈ గోల్డ్ ఫిష్ దేశీయ జాతులకు వినాశనం తీసుకువస్తుందని అంటున్నారు.

“దయచేసి మీ పెంపుడు గోల్డ్ ఫిష్ ను చెరువులు, సరస్సులలోకి విడుదల చేయవద్దు!” అంటూ నగర అధికారులు ట్వీట్ చేశారు. “అవి మీరు అనుకున్నదానికంటే పెద్దవిగా పెరుగుతాయి. దిగువ అవక్షేపాలను, మొక్కలను వేరుచేయడం ద్వారా నీటి నాణ్యత పడిపోవడానికి దోహదం చేస్తాయి.” అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

గత నవంబరులో, సమీపంలోని కార్వర్ కౌంటీలోని అధికారులు స్థానిక జలాల నుండి 50,000 గోల్డ్ ఫిష్లను తొలగించారు. కౌంటీ వాటర్ మేనేజ్‌మెంట్ మేనేజర్ పాల్ మోలిన్ మాట్లాడుతూ, గోల్డ్ ఫిష్ “సరస్సుల నీటి నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేసే అధిక సామర్థ్యం కలిగిన తక్కువ అవగాహన లేని జాతి.” అని చెప్పారు. శీతాకాలంలో తక్కువ ఆక్సిజన్ స్థాయిలు ఉన్నప్పటికీ గోల్డ్ ఫిష్ లు సులభంగా పునరుత్పత్తి చేయగలవని అధికారులు వివరిస్తున్నారు. ఈ కారణంగా సరస్సులలో వదిలివేస్తున్న గోల్డ్ ఫిష్ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి సరస్సులోని నీటి నాణ్యత దెబ్బతీస్తుంది అని వారంటున్నారు.

ఇలా సరస్సులలో ప్రజలు వదిలివేసే అక్వేరియం పెంపుడు జంతువులతో పర్యావరణ విధ్వంసం జరగడం కొత్త విషయం కాదు. 1982 లో ఆండ్రూ హరికేన్ తరువాత ఫ్లోరిడా పెంపుడు జంతువుల యజమానులు విడుదల చేసినట్లు భావిస్తున్న మాంసాహార లయన్ ఫిష్, డజన్ల కొద్దీ కరేబియన్ జాతులను చంపింది. ఆసియా కార్ప్, జీబ్రా మస్సెల్స్ సహా ఇతర ఆక్రమణ జాతుల కంటే గోల్డ్ ఫిష్ తో తక్కువగానే ఇబ్బంది ఉన్నప్పటికీ, వర్జీనియా, వాషింగ్టన్ రాష్ట్రాలతో పాటు ఆస్ట్రేలియా, కెనడాలో కూడా ఈ చేపలను సరస్సులలో వదిలిపెట్టవద్దు అనే హెచ్చరికలు జారీ చేశారు.

2013 లో, సైంటిఫిక్ అమెరికన్ నివేదిక ప్రకారం, తాహో సరస్సులో ప్రయాణిస్తున్న పరిశోధకులు దాదాపు 1.5 అడుగుల పొడవు,4.2lb బరువు గల గోల్డ్ ఫిష్‌ను వలలో పట్టుకున్నారు. వర్జీనియాలో ఒక జాలరి 16 అంగుళాల ఒక గోల్డ్ ఫిష్ ను పట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత పెంపుడు జంతువుల యజమానులు తమ జల జీవులను ఎప్పుడూ సరస్సులలో విడుదల చేయకూడదు అంటూ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ ప్రతి సంవత్సరం 200 మిలియన్ల గోల్డ్ ఫిష్లను పెంచుతున్నట్లు అంచనా.

అధికారులు విడుదల చేసిన ట్వీట్:

Also Read: US Heatwave: నిప్పుల కొలిమిలా కాలిఫోర్నియా.. వేడి గాలులు, వడగాడ్పులతో అమెరికా సతమతం..

Scientist Sowmya Swaminathan: డేంజర్ సుమా ! బీ అలెర్ట్ ! వేర్వేరు వ్యాక్సిన్ల మిక్సింగ్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక..