కనిపిస్తుందా రణజ్వాల.. వినిపిస్తుందా పొలికేక.. నివురుగప్పిన నిప్పులా ప్రపంచం..

ఎనిమిదిసార్లు యుద్ధాలు ఆపా, రెండుసార్లు రాబోతున్న యుద్ధాల్ని కూడా అడ్డుకున్నా.. ఐక్యరాజ్యసమితి వేదికపైకెక్కి గొంతు చించుకుని, శాంతికపోతంలా ఫోజు పెడతాడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంపు. కానీ నోబెల్ పీస్ ప్రైజ్ రాలేదన్న అక్కసుతో ఆయనలా చెబితే చెప్పారు గానీ, ఆయన చెప్పిందాంట్లో నిజం ఎంత అని ఫ్యాక్ట్‌చెక్ చేసుకుంటే, ఒక్కటంటే ఒక్క యుద్ధమూ ఆగింది లేదు.. సాగుతూనే ఉంది. ఇదే అంశాన్ని ఇంకో కోణంలో చూస్తే.. ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డం ఖాయం. ఎస్.. గ్లోబ్ కింద అగ్గిపుట్టి యుద్ధోన్మాదంతో ఉడికిపోతోంది ప్రపంచం.

కనిపిస్తుందా రణజ్వాల.. వినిపిస్తుందా పొలికేక.. నివురుగప్పిన నిప్పులా ప్రపంచం..
Global Conflicts

Updated on: Oct 12, 2026 | 9:50 PM

2022 ఫిబ్రవరిలో మొదలైన ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 20శాతం ఉక్రెయిన్‌ని అక్రమించుకున్నా శాంతించడం లేదు రష్యా. గత డిసెంబర్‌లో మొదలైన ఇరాన్-ఇజ్రాయెల్ వార్.. ఆగినట్టే ఆగి, మళ్లీ సాగుతోంది. గల్ఫ్‌లో నింగీనేలా మండుతూనే ఉంది. పాకిస్తాన్‌లోపల పుట్టిన అగ్గి రాజుకుంటూనే ఉంది. పెర్పెట్యువల్ వార్.. ఆగని-సాగని ఒక నిశ్శబ్ద యుద్ధం.. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని రౌండప్ చేసింది. ప్రపంచయుద్ధం వస్తుందో రాదో గాని, ఇప్పుడు ప్రపంచమే యుద్ధమైంది. నిప్పుల కొలిమిలో సలసలా కాగుతోంది. కాకపోతే ఆ సెగ మనదాకా రావడం లేదు..అంతే. అవును.. అన్నీ వార్‌ హెడ్‌లైన్సే. రక్తాన్ని మరిగించే వార్తలే. అన్నీ ప్రపంచం తలరాతని మారుస్తున్న వార్తలే. అన్నీ యుద్ధోన్మాదం తాలూకు నెత్తుటి క్రీడలే. ఔను, సెగ మన దాకా వచ్చినా రాకపోయినా సెగ మాత్రం నిజం. నిరంతర యుద్ధంతో ప్రపంచమే ప్రమాదపుటంచుల్లో పడింది. కనీవినీ ఎరుగనంత నష్టాన్ని చవిచూస్తోంది. పశ్చిమాసియా శాంతిస్థాపన కోసం తగుదునమ్మా అంటూ పాకిస్తాన్ థర్డ్ అంపైరింగ్ చేసిన తేదీ గుర్తుందా? 2026 జూన్ 17. ఇది జరిగి దాదాపు నాలుగునెలలైంది. కానీ, ఇరాన్‌-అమెరికా మధ్య జరిగిన ఇస్లామాబాద్ డిక్లరేషన్‌ను అప్పుడే చించిపారేసింది ఇజ్రాయెల్. సీజ్‌ఫైర్ అనౌన్స్ చేసినరోజే… గల్ఫ్‌ దేశాలపైకి దూసుకెళ్లాయి టెహ్రాన్ మిస్సైళ్లు. సీజ్‌ఫైర్...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి