Wheelchair Cricket: ముగిసిన వీల్‌చైర్‌ క్రికెట్‌ పోటీలు.. క్రీడాకారులకు మూడు చక్రాల సైకిళ్లు, దుప్పట్లు అందజేత

|

Dec 14, 2022 | 6:52 PM

విన్నర్స్, రన్నర్స్ తో పాటు పోటీలో పాల్గొన్న క్రీడాకారులు అందరికీ తానా నేతలు మెమెంటోలు అందజేశారు. 15 మూడు చక్రాల సైకిళ్లు 100 దుప్పట్లు క్రీడాకారులకు అందజేశారు

Wheelchair Cricket: ముగిసిన వీల్‌చైర్‌ క్రికెట్‌ పోటీలు.. క్రీడాకారులకు మూడు చక్రాల సైకిళ్లు, దుప్పట్లు అందజేత
Wheelchair Cricket Competition
Follow us on

గత నాలుగు రోజులుగా ‘తానా‘ ఆధ్వర్యంలో, గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలంలయం డీమ్డ్‌ వర్శిటీ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న దక్షిణ భారత దివ్యాంగుల క్రికెట్‌ పోటీలు డిసెంబర్‌ 13 తో ముగిశాయి ఈ పోటీలలో కర్నాటక జట్టు విన్నర్స్ గా నిలవగా తమిళనాడు జట్టు రన్నర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు ఉత్సవానికి గీతం విశ్వవిద్యాలయం చైర్మన్ ఎం శ్రీ భరత్, రాజ్యసభ మాజీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ తానా కార్యదర్శి వేమూరి సతీష్ చైతన్య స్రవంతి ఇంచార్జ్ సునీల్ పంత్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఉమా కటికి తదితరులు హాజరయ్యారు.

తానా తరపున క్రికెట్ పోటీలు నిర్వహించిన స్పోర్ట్స్ కమిటీ కన్వీనర్ యార్లగడ్డ శశాంక్‌ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు విన్నర్స్, రన్నర్స్ తో పాటు పోటీలో పాల్గొన్న క్రీడాకారులు అందరికీ తానా నేతలు మెమెంటోలు అందజేశారు. 15 మూడు చక్రాల సైకిళ్లు 100 దుప్పట్లు క్రీడాకారులకు అందజేశారు. గీతం చైర్మన్ భరత్ మాట్లాడుతూ భవిష్యత్తులో తానా ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని వచ్చే ఏడాది జాతీయస్థాయిలో వీల్ చైర్ పోటీలు నిర్వహిస్తే సహకరిస్తామని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..