Bangladesh: ఆలయం కనిపిస్తే విలయం.. బరితెగించిన బంగ్లాదేశ్‌

నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్న ప్రముఖుడి సారధ్యంలోని సర్కారు.. పిచ్చోడి చేతిలో రాయిగా మారిపోయింది. అక్కడి అల్పసంఖ్యాక వర్గాలపై మత విద్వేషం బుసలు కొడుతోంది. సనాతన ధర్మ ప్రచారకుడిపై దేశద్రోహి ముద్రవేసింది. ఆయనకు న్యాయం జరగనివ్వకుండా.. లాయర్ల రక్తం కళ్లచూస్తోంది. ఆలయం కనిపిస్తే చాలు.. విలయం సృష్టిస్తోంది. చివరికి మన మువ్వన్నెల జెండాని కూడా భరించలేకపోతోంది. బంగ్లాదేశ్‌లో సిట్యువేషన్‌ ఔటాఫ్‌ కంట్రోల్‌. ఇప్పుడేం చేయబోతోంది కేంద్రం?

Bangladesh: ఆలయం కనిపిస్తే విలయం.. బరితెగించిన బంగ్లాదేశ్‌
Bangladesh

Updated on: Dec 03, 2024 | 9:42 PM

హిందూధర్మంపై మాట్లాడటమే ఆయన నేరం. బాధితులపక్షాన పోరాడటమే ఆయన చేసిన ద్రోహం. చిన్మయ్‌ కృష్ణదాస్‌కోసం వచ్చిన లాయర్‌.. ఐసీయూలో చావుబతుకుల్లో ఉన్నారు. వాదించేందుకు ఒక్క లాయర్‌ కూడా ముందుకు రాలేనంత.. భీతావహ వాతావరణాన్ని సృష్టించింది బంగ్లాదేశ్‌. ఇస్కాన్‌ ఎకౌంట్లను ఫ్రీజ్‌చేసింది. జర్నలిస్టులు, టూరిస్టులను కూడా టార్గెట్‌ చేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా.. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే ఉంది. బరితెగించిన బంగ్లాదేశ్‌.. చిన్నసాయం చేస్తేనే ఎవరికైనా జీవితాంతం ఆ కృతజ్ఞత ఉంటుంది. కానీ స్వేచ్ఛావాయువులు ప్రసాదించిన భారత్‌పైనే పొరుగుదేశం విషం కక్కుతోంది. దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువులపై మత విద్వేషంతో విరుచుకుపడుతోంది. పరమపవిత్రంగా భావించే ఆలయాలపైనా దాడులకు తెగబడుతోంది. భారత జాతీయపతాకాన్ని అవమానిస్తోంది. హిందువుల రక్షణకు గొంతెత్తిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ని దేశద్రోహి ముద్రవేసి జైల్లోవేసిన ప్రభుత్వం..చివరికి న్యాయ సహాయం కూడా అందకుండా చేస్తోంది. చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగాల్సి ఉంది. కానీ చిన్మయ్‌కోసం వచ్చిన లాయర్‌ చావుబతుకుల మధ్య ఐసీయూలో ఉన్నారు. ప్రభుత్వ ప్రేరేపిత విద్వేషంలో కన్నూమిన్నూగనని అల్లరి మూకలు ఆ లాయర్‌పై దాడిచేశాయి. దీంతో బంగ్లాదేశ్‌ కోర్టులో చిన్మయ్‌ తరపున వాదించేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. ప్రభుత్వం సమయం కోరటంతో చిన్మయ్‌ బెయిల్ పిటిషన్‌ విచారణని జనవరి 2కి వాయిదా వేసింది న్యాయస్థానం. చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్‌ని కొందరు లాయర్లు వ్యతిరేకించారు. గతవారం దేశద్రోహం నేరంమోపి చిన్మయ్‌ కృషదాస్‌ని అరెస్ట్‌చేసింది బంగ్లాదేశ్‌ ప్రభుత్వం. ఇస్కాన్‌ సంస్థ దూరంపెట్టినా.. బంగ్లాదేశ్‌లో హిందూసమాజానికి అండగా...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి