Breaking News
  • మద్యం ఎక్కువ వినియోగం ఉన్న ప్రాంతాల్లో.. మద్యం షాపులను తగ్గించలేదు-అచ్చెన్నాయుడు. సేల్స్ లేని చోట మాత్రమే షాపులు తగ్గించారు-అచ్చెన్నాయుడు.
  • ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.
  • గుంటూరు: మైనర్‌ బాలికపై అత్యాచార ఘటన చాలా బాధాకరం. అసెంబ్లీలో దిశ బిల్లు పెట్టిన రోజే ఘటన జరగడం దారుణం-చంద్రబాబు దిశ చట్టం తెచ్చారు.. 21 రోజుల్లో ఉరి అన్నారు మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు దిశ విషయంలో చూపిన శ్రద్ధ.. మైనర్‌ బాలికపై ఎందుకు చూపడంలేదు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. బాధిత కుటుంబానికి టీడీపీ తరపున రూ.50 వేల ఆర్థికసాయం-చంద్రబాబు.
  • ఆర్టీసీ విలీనంపై టైమ్‌బాండ్‌ పెట్టి కమిటీని నియమించాం-పేర్ని నాని. కమిటీ నివేదిక వచ్చాక ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై కొత్త చట్టం తెస్తున్నాం. 200 రోజుల్లోనే జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు-పేర్ని నాని. ఆర్టీసీ విలీనంతో ప్రభుత్వంపై రూ.3,600 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. జనవరి 1లోగా ప్రజా రవాణాశాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం-పేర్ని నాని.
  • రేపు యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ పర్యటన.
  • జులై 1వ తేదీ నాటికి 4,380 షాపులు ఉన్నాయని ఎక్సైజ్‌శాఖ నివేదిక. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 20శాతం మద్యం షాపులు తగ్గించాం. ప్రస్తుతం 3,456 షాపులకు కుదించాం-సీఎం జగన్‌. 43 వేల బెల్ట్‌ షాపులను ఎత్తివేశాం-సీఎం జగన్‌. ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. సభను తప్పుదోవ పట్టించేలా అచ్చెన్నాయుడు అబద్ధాలాడుతున్నారు. అచ్చెన్నాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నా-జగన్‌. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.

నారా వారి అబ్బాయి సినిమాలకేమైంది..?

Why Nara Rohith is staying away from films, నారా వారి అబ్బాయి సినిమాలకేమైంది..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ నుంచి మొదటి హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు నారా రోహిత్. 2009లో ‘బాణం’ సినిమా ద్వారా వచ్చిన రోహిత్.. ఇప్పటివరకు 18 చిత్రాల్లో నటించాడు(సారొచ్చారులో అతిథి పాత్ర కలుపుకొని). అయితే వీటిలో ఏడెనిమిది చిత్రాలు మినహాయించి.. మిగిలినవన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా మిగిలాయి. ఈ మధ్యలోనే అరన్ మీడియా వర్క్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి.. నాలుగు చిత్రాలను కూడా నిర్మించాడు. అంతేకాదు మొదటి నుంచి వైవిధ్య కథలనే ఎంచుకుంటూ వచ్చిన నారా రోహిత్.. పలువురు దర్శకులను కూడా టాలీవుడ్‌కు పరిచయం చేశాడు.

ఇదంతా పక్కనపెడితే అంతకుముందు సంవత్సరానికి కనీసం రెండు సినిమాలతోనైనా పలకరించే రోహిత్.. ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. చివరి సారిగా గతేడాది ‘వీర భోగ వసంత రాయలు’ అనే చిత్రంలో కనిపించాడు ఈ హీరో. ‘అనగనగా దక్షిణాదిలో’, ‘శబ్ధం’, ‘పండగలా వచ్చాడు’ అనే చిత్రాల్లో నటించినప్పటికీ.. ఇందులో ఈ సంవత్సరం ఒక్కటి కూడా విడుదలకు నోచుకోలేదు. ఇక ఇటీవల తన స్నేహితుడు శ్రీవిష్ణు తిప్పరా మీసం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చినా.. తన సినిమాల గురించి మాత్రం ఏం మాట్లాడలేదు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో నారా రోహిత్.. టాలీవుడ్‌కు బై బై చెప్పాడన్న వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను అతడి సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. త్వరలో రోహిత్.. ఓ పీరియాడిక్ డ్రామాలో కనిపించనున్నాడని వారు అంటున్నారు. మరి ఇందులో నిజమెంత..? నారా రోహిత్ తదుపరి చిత్రం ఏంటి..? అనే వివరాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.