నాని.. నాని.. ఎవరిది బోణీ..?

వాళ్ళు ఐదుగురు… వారి మధ్య బంధుత్వం ఏమి లేదు.. అలాంటిది ఈ ఐదుగురు ఎన్నికల సమరంలో సై అన్నారు. అదేంటి ఎన్నికల సమరంలో చాలామంది పోటీ చేస్తున్నారు కదా.! వీరి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తున్నారా.. వీరి పేర్లు ఒకటే అదే ‘నాని’.. ఇప్పుడు వారి గురించే అందరూ కూడా చర్చించుకుంటున్నారు.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు నానీలు సందడి చేస్తున్నారు. గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని.. బందరు నుంచి వైసీపీ అభ్యర్థి పేర్ని […]

నాని.. నాని.. ఎవరిది బోణీ..?
Follow us

|

Updated on: May 22, 2019 | 12:02 PM

వాళ్ళు ఐదుగురు… వారి మధ్య బంధుత్వం ఏమి లేదు.. అలాంటిది ఈ ఐదుగురు ఎన్నికల సమరంలో సై అన్నారు. అదేంటి ఎన్నికల సమరంలో చాలామంది పోటీ చేస్తున్నారు కదా.! వీరి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తున్నారా.. వీరి పేర్లు ఒకటే అదే ‘నాని’.. ఇప్పుడు వారి గురించే అందరూ కూడా చర్చించుకుంటున్నారు..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు నానీలు సందడి చేస్తున్నారు. గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని.. బందరు నుంచి వైసీపీ అభ్యర్థి పేర్ని నాని.. ఏలూరులో వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని, చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని.. తాడేపల్లిగూడెం నుంచి టీడీపీ అభ్యర్థి ఈలి నాని పోటీ చేశారు. ఇప్పుడు ఈ ఐదు నానీలలో ఎవరు గెలుస్తారనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అసలు ఈ అంశం ఏమిటో ఇప్పుడు చూద్దాం.