జ్యోతిరాదిత్య తిరుగుబాటు.. నో వర్రీ ! కమల్ నాథ్

కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటును, ఆయనకు మద్దతుదారులైన 21 మంది ఎమ్మెల్యేల రాజీనామాను మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ తేలిగ్గా తీసుకున్నారు.

జ్యోతిరాదిత్య  తిరుగుబాటు.. నో వర్రీ ! కమల్ నాథ్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 11, 2020 | 11:11 AM

కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటును, ఆయనకు మద్దతుదారులైన 21 మంది ఎమ్మెల్యేల రాజీనామాను మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ తేలిగ్గా తీసుకున్నారు. ఈ పరిణామం పట్ల తామేమీ ఆందోళన చెందడంలేదని, శాసన సభలో మెజారిటీని నిరూపించుకుంటామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం పూర్తి కాలం పదవిలో కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. జ్యోతిరాదిత్య మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, పార్టీ ఆయనను బహిష్కరించడం తెలిసిందే. ఇక ఆయనను బీజేపీ తన ‘అక్కున చేర్చుకుంటుందని’,  రాజ్యసభ సీటును, కేంద్ర మంత్రి పదవిని ఇవ్వడానికి సిధ్ధంగా ఉందని కూడా వార్తలు వచ్చాయి. జ్యోతిరాదిత్య ‘పరిణామాల’ కారణంగా మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. కాగా-కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. కమల్ నాథ్ ప్రభుత్వానికి వఛ్చిన ప్రమాదమేమీ లేదని చెప్పారు. ఆయన రాజీనామా చేయబోరని, అసెంబ్లీలో తన ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకుంటారని అన్నారు. కమల్ నాథ్ గట్టెక్కుతారా అని ప్రశ్నించగా.. అందుకు అవకాశం ఉందన్నారు. నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందన్నారు. పైగా రెబెల్ ఎమ్మెల్యేల్లో కొంతమంది తిరిగి తమతో చేరవచ్చునని, వారి కుటుంబాలు తమతో టచ్ లో ఉన్నారని దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. వారు తమ  శాసన సభ్యత్వాలను వదులుకోవడానికి ఇష్టపడడం లేదన్నారు.

జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేయకుండా చూసేందుకు తమ పార్టీ ఎంతో కృషి చేసిందని, ఆయనకు పీసీసీ అధ్యక్షపదవిని ఇవ్వజూపితే నిరాకరించారని దిగ్విజయ్ తెలిపారు. అలాగే  డిప్యూటీ సీఎం పదవిని కూడా అంగీకరించలేదని,  , పైగా ఆయన రాజ్యసభ సీటును ఆశిస్తే ఎవరు వ్యతిరేకిస్తారని దిగ్విజయ్ పేర్కొన్నారు. పార్టీలో ఇన్నిఅనుకూలతలు ఉన్నా జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ వైపు మొగ్గడం చూస్తే.. కాషాయ పార్టీ ఆయనను ఎంతగా ప్రలోభ పెట్టిందో తెలుస్తోందని దిగ్విజయ్  వ్యాఖ్యానించారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ