ఇది సువర్ణాక్షరాలతో లిఖించే రోజు: జీవీఎల్‌

We Creates History In Parliament Says BJP MP GVL Narasimha Rao, ఇది సువర్ణాక్షరాలతో లిఖించే రోజు: జీవీఎల్‌

న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్‌ 370 రద్దుతో చరిత్ర సృష్టించామని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వ్యాఖ్యానించారు. ‘ఇది సువర్ణాక్షరాలతో లిఖించే రోజు’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడింట రెండు వంతుల మెజారిటీతో బిల్లు పాసయిందని తెలిపారు. రాజ్యసభలో తమకు మెజారిటీ లేకపోయినా బిల్లు పాస్ చేయించామన్నారు. ఆర్టికల్ 370 కారణంగా జమ్మూకశ్మీర్ తీవ్రంగా వెనుకబడిందని పేర్కొన్నారు. తాజాగా తీసుకొచ్చిన బిల్లులతో జమ్మూకశ్మీర్లో నూతన పరిపాలనకు నాంది పలుకుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *