వార్నీ.. తన మీద తానే సెటైర్ వేసుకున్నాడే

Virendra Sehwag trolls himself,

సోషల్ మీడియాలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. అవకాశం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో విభిన్న శైలిలో ట్వీట్లు చేసే ఈ మాజీ క్రికెటర్.. తాజాగా తనపై తానే సెటైర్ వేసుకున్నాడు. ఓ మ్యాచ్ గురించి గుర్తుచేసుకున్న ఆయన తాను డకౌట్ అయిన విషయాన్ని సెటైరికల్‌గా పేర్కొన్నాడు.

‘‘సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌ జట్టుపై జరిగిన మూడో టెస్ట్‌లో కింగ్ పెయిర్ స్కోర్ చేశా. ఆ స్కోర్‌తో అనుకోకుండా ఆర్యభట్టకు నేను నివాళులు అర్పించా(డకౌట్). మనం పెయిల్ అవ్వడానికి జీరో ఛాన్స్ ఉంటే ఏమీ చేస్తాం. మీరు ఏదైనా కనిపెడితే అది చేయండి’’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. కాగా ఆ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన సెహ్వాగ్.. మూడో టెస్ట్‌లో సున్నాకే ఔటయ్యాడు. ఇక ఈ సిరీస్‌ను 4-0తో కైవసం చేసుకుంది ఇంగ్లండ్ టీమ్. కాగా ఈ ట్వీట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *