రష్యా “కాంట్రాక్ట్ కిల్లింగ్’ వ్యూహం.. ఉక్రెయిన్‌కు పట్టుబడ్డ కిరాయి హంతకులు
ఉక్రెయిన్ మిలిటరీ వ్యూహకర్తలను హత్య చేసేందుకు రష్యా పన్నిన కుట్రను ఉక్రెయిన్ బలగాలు భగ్నం చేశాయి. ఆండ్రీ యూసోవ్ సహా ఇతర వ్యూహకర్తలను లక్ష్యంగా చేసుకుని, ఒక్కో హత్యకు $100,000 సుపారీ ఆశ చూపిన మాస్కో ఏజెంట్లను అరెస్ట్ చేశారు. 10 మంది సభ్యుల అంతర్జాతీయ హంతక ముఠాను పట్టుకున్నారు. భారీ నగదు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలను పెంచింది.
ఉక్రెయిన్ మిలిటరీ వ్యూహకర్తలను హత్య చేయడం కోసం యత్నించిన రష్యా రహస్య ఏజెంట్ల గుట్టు రట్టయింది. ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ లక్ష్యంగా గతంలో కుట్రలు చేసిన మాస్కో.. ఈసారి లక్ష డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.90 లక్షలు భారీ సుపారీ ఆశ చూపి కిరాయి హంతకులను రంగంలోకి దింపింది. ఈ ఆపరేషన్‌ను ఉక్రెయిన్ బలగాలు చాకచక్యంగా అడ్డుకున్నాయి. ఈ హంతక ముఠా ప్రధాన టార్గెట్ ఉక్రెయిన్ మిలిటరీ వ్యూహకర్త ఆండ్రీ యూసోవ్. అతన్ని చంపేందుకు ప్లాన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆయన ఉక్రెయిన్ సైనిక సమాచార వ్యవస్థను పర్యవేక్షించడమే కాకుండా రష్యాతో యుద్ధ ఖైదీల మార్పిడి ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నారు. టార్గెట్ చేసిన వ్యక్తి ఎంత ప్రముఖుడైతే.. అంత ఎక్కువ మొత్తంలో రష్యా నగదు ఆశ చూపింది. ఒక్కో హత్యకు గరిష్టంగా 1,00,000 డాలర్ల భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.90 లక్షలు వరకు ఇస్తామని రష్యా వాగ్దానం చేసింది. మాస్కో ఆదేశాలతో రంగంలోకి దిగిన 10 మంది సభ్యుల అంతర్జాతీయ హంతక ముఠాను ఉక్రెయిన్ అధికారులు అరెస్ట్ చేశారు. రష్యాపై యుద్ధం మొదలై నాలుగేళ్లు గడుస్తున్న వేళ.. రష్యా ఈ ‘కాంట్రాక్ట్ కిల్లింగ్’ వ్యూహాన్ని అమలు చేసిందని ఉక్రెయిన్ ఆరోపించింది. ఉక్రెయిన్‌లో ఏడుగురిని, మోల్డోవాలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ముఠా నాయకుడు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 20 చోట్ల జరిపిన సోదాల్లో భారీగా నగదు, మారణాయుధాలు, పేలుడు పదార్థాలు, రష్యా హ్యాండ్లర్లతో జరిపిన సంభాషణల ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఉక్రెయిన్ మాత్రమే కాదు రష్యా కూడా తమ వైపు ఉన్న కీలక నేతల హత్యలకు ఉక్రెయిన్ కారణమని ఆరోపిస్తోంది. దీనిపై స్పందించిన కీవ్.. రష్యా దురాక్రమణకు సహకరిస్తున్న వారికి బుద్ధి చెప్పేందుకే తాము కొన్ని ఆపరేషన్లు చేస్తున్నామని.. అది ‘శిక్ష’ మాత్రమేనని గతంలో ప్రకటించింది. ప్రస్తుతం పట్టుబడ్డ 10 మందిపై ఉగ్రవాదం, హత్యాయత్నం, దేశద్రోహం కింద కేసులు నమోదు చేశారు. ఈ ఉదంతం రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా కనిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్పీడ్ రేసింగ్‌లో నాగచైతన్య.. టీమ్ కోసం రంగంలోకి అక్కినేని వారసుడు