75 లగ్జరీ వాచ్‌లు.. 200 డిజైనర్ బ్యాగులు, థాయ్ ప్రధాని ఎంత రిచ్చో..
థాయ్ లాండ్ ప్రధాని గా పెటోంగ్టార్న్ షినవ్రత గత ఏడాది ఆగస్టులో బాధ్యతలు చేపట్టారు. ఆమె మేనత్త ఇంగ్లక్ షినవ్రత తర్వాత థాయ్ లాండ్ ప్రధాని పీఠం అధిష్ఠించిన రెండో మహిళ గా పెటోంగ్టార్న్ షినవ్రత నిలిచారు. ఆమె తండ్రి తక్సిన్ షినవ్రత కూడా థాయ్ ప్రధానిగా వ్యవహరించారు. టెలికాం రంగ వ్యాపార దిగ్గజం అయిన తక్సిన్ షినవ్రత థాయ్ లాండ్ లోని టాప్-10 బిలియనీర్లలో ఒకరు.
ఆయన చిన్న కుమార్తె పెటోంగ్టార్న్ షినవ్రత కేవలం 38 సంవత్సరాల వయసులో ప్రధానిగా ఎన్నికయ్యారు. తాజాగా, ఆమె ఆస్తులకు సంబంధించిన ఆసక్తికర వివరాలు బయటపడ్డాయి. ప్రధాని పెటోంగ్టార్న్ షినవ్రత తన ఆస్తుల విలువ 3,430 కోట్ల రూపాయలకు పైనే అని ప్రకటించారు. కొంతమేర అప్పులు కూడా ఉన్నాయట. జపాన్, బ్రిటన్ లోనూ ఈ మహిళా ప్రధానికి ఆస్తులు ఉన్నాయి. ఇక, పెటోంగ్‌టార్న్ షినవ్రత లేటెస్ట్ ఫ్యాషన్ ఫాలో అవుతుంటారు. ఆమె వద్ద ఖరీదైన 200 డిజైనర్ బ్యాగులు, 75 లగ్జరీ వాచ్ లు, 67 నెక్లెస్ లు, 205 జతల చెవి కమ్మలు, 108 ఉంగరాలు, 6 బ్రేస్ లెట్లు, 167 ఫ్యాషన్ దుస్తులు ఉండడమే అందుకు నిదర్శనం. ఈ మేరకు తన ఆస్తుల వివరాలను ప్రధాని పెటోంగ్టార్న్ షినవ్రత జాతీయ అవినీతి వ్యతిరేక కమిషన్ కు సమర్పించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్..
ఎన్ని కోట్లు పెట్టి కొంటే ఏం లాభం.. ఆఖరికి ఎడ్ల బండితో లాగాల్సి వచ్చింది
లాటరీ చరిత్రను తిరగరాసే ఘటన.. రూ.10 వేల కోట్ల జాక్‌పాట్ టిక్కెట్ అమ్మకం !!