Israel-Hamas Conflict: అమెరికాకు హమాస్ నేత డెడ్లీ వార్నింగ్..
అమెరికా ఒక గతంలా మిగిలిపోతుంది.. అమెరికా పతనం తప్పదు.. ఇది హమాస్ నేత అలీ బరాకా అగ్రరాజ్యం అమెరికాకు ఇచ్చిన వార్నింగ్. అవును, ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరపోరు జరుగుతున్న నేపధ్యంలో ఇజ్రాయెల్‌కు అమెరికా అండగా నిలిచింది. మరోవైపు యుద్ధాన్ని విరమింపచేసేందుకు అమెరికా సహా పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు హమాస్ సీనియర్ లీడర్.
అమెరికా ఒక గతంలా మిగిలిపోతుంది.. అమెరికా పతనం తప్పదు.. ఇది హమాస్ నేత అలీ బరాకా అగ్రరాజ్యం అమెరికాకు ఇచ్చిన వార్నింగ్. అవును, ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరపోరు జరుగుతున్న నేపధ్యంలో ఇజ్రాయెల్‌కు అమెరికా అండగా నిలిచింది. మరోవైపు యుద్ధాన్ని విరమింపచేసేందుకు అమెరికా సహా పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు హమాస్ సీనియర్ లీడర్. అగ్రరాజ్యంగా భావిస్తున్న అమెరికా ఏదో ఒక రోజు గతంగా మిగిలిపోతుందని, పూర్వ రష్యా, యూఎస్ఎస్ఆర్ మాదిరిగా పతనమవుతుందని తీవ్ర హెచ్చరిక జారీ చేశాడు. ఈ ప్రాంతంలోని అమెరికా శత్రువులందరూ చర్చలు జరుపుతున్నారని, వారంతా ఒక్కటవుతున్నారని, అంతా కలిసి ఉమ్మడిగా యుద్ధంలో పాల్గొనే రోజు రావొచ్చని తీవ్రంగా హెచ్చరించాడు. బ్రిటన్, గ్లోబల్ ఫ్రీమాసన్రీ కారణంగా అమెరికా ఏర్పడిందని, ఏదో ఒక రోజు తప్పకుండా కూలిపోతుందని పేర్కొన్నాడు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో అతడు ఈ విధంగా స్పందించాడని జెరూసలేం పోస్ట్ రిపోర్ట్ పేర్కొంది. నవంబర్ 2న ఓ లెబనీస్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దీపావళికి ఉద్యోగులకు సర్‌ప్రైజ్ !! కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన యజమాని..
అడ్మిట్ కార్డు ఆలస్యం పట్ల బెనర్జీ న్యాయపోరాటం
రెన్యూవల్‌కు వచ్చిన పాస్‌పోర్టును చూసి షాకైన సిబ్బంది
Karnataka CM: కర్ణాటక రాజ్యోత్సవంలో డ్యాన్స్ అదరగొట్టిన సీఎం
Sachin Tendulkar: అయ్యో.. సచిన్ విగ్రహంలో సచిన్ ఏడీ ?? బీసీసీఐపై మండిపడుతున్న ఫ్యాన్స్