మా దుస్థితికి బాధ్యులు మీరే.. ఆ.. దేశాలపై నేపాల్ ఫైర్ !
హిమాలయాల్లో వరదలతో భారీ విధ్వంసం చోటుచేసుకోవడంతో నేపాల్ పారిశ్రామిక దేశాలపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అమెరికా, చైనా, భారత్ వంటి దేశాల అధిక ఉద్గారాలే వాతావరణ సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తున్నాయని, దాని ప్రభావంతో హిమాలయాల మంచు కరిగి తమ దేశం భారీ నష్టం ఎదుర్కొంటోందని వాదిస్తోంది. విపత్తు సాయానికి బదులుగా ‘క్లైమేట్ కాంపెన్సేషన్’ చెల్లించాలని, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ద్వారా పరిహారం అందించాలని డిమాండ్ చేస్తోంది.
పొగ మీది..ప్రళయం మాకు! పరిశ్రమలు మీవి, ఉద్గారాలు మీవి, కరుగుతున్న మంచు మాది. కొట్టుకుపోతున్న ఊళ్లు, పోతున్న ప్రాణాలు మావి..అంటూ ప్రపంచాన్ని నిలదీస్తోంది నేపాల్. ఇందుకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా అమెరికా, చైనాల మూలంగానే మాకీ దుస్థితి అంటూ ఆరోపిస్తోంది. నేపాల్ ఆరోపణల్లో భారత్‌ను కూడా చేర్చింది. ఇంతకూ నేపాల్ ఆరోపణల్లో వాస్తవమెంత. చైనా, అమెరికానే నేపాల్ ఫ్లడ్స్‌కు కారణమా ? హిమాలయాల్లో సంభవించిన పెను ముంపు విలయం వేలాది ఇళ్లు, రహదారులు, జలవిద్యుత్ కేంద్రాలను క్షణాల్లో నేలమట్టం చేసింది. వెయ్యిమందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాదిమంది ఆచూకీ గల్లంతయింది. ఈ తీవ్ర విధ్వంసాన్ని కేవలం ప్రకృతి విపత్తుగా కొట్టిపారేయొద్దని నేపాల్ ప్రపంచ దేశాలను గట్టిగా కోరుతోంది. హిమాలయాలు కరిగిపోడానికి, వాతావరణ సంక్షోభానికి అమెరికా, చైనా, భారత్ వంటి పారిశ్రామిక దేశాలే ప్రధాన బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తోంది. తమకు కావాల్సింది దానం కాదని, మీరు సృష్టించిన వాతావరణ సంక్షోభానికి చెల్లించాల్సిన మూల్యం అంటూ ప్రపంచ దేశాలను నిలదీస్తోంది నేపాల్. ఇప్పుడాదేశం కోరుతున్నది సాధారణ విపత్తు సహాయం మాత్రమే కాదు..క్లైమేట్ కాంపెన్సేషన్. ప్రపంచ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల్లో తమ వాటా అత్యల్పమని… అయినా వాతావరణ మార్పుల కారణంగా అత్యంత భారీ మూల్యం చెల్లిస్తున్నామని నేపాల్ వాదిస్తోంది. భారీ పరిశ్రమలు, శిలాజ ఇంధనాల వాడకంతో అభివృద్ధి చెందిన దేశాలు భూమిని వేడెక్కిస్తే, ఆ ప్రభావంతో హిమాలయాల మంచు కరిగి తమ గ్రామాలు, వ్యవసాయ భూములు, జీవనాధారాలు కొట్టుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రాణనష్టం, నాశనమైన ఇళ్లు, వ్యవసాయ భూములు, ధ్వంసమైన విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన పునరావాస ఖర్చులను సంపన్న దేశాలే భరించాలని నేపాల్ విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. అభివృద్ధి లాభాలను తమ ఖాతాల్లో వేసుకున్న దేశాలు, నష్టాలను తమలాంటి బలహీన దేశాలపై మోపడం ఏమాత్రం న్యాయం కాదని ప్రశ్నిస్తోంది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ‘లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్’ ద్వారా వేగంగా తగిన పరిహారం అందించాలని, సరిహద్దు నదుల డేటా మార్పిడి, సురక్షిత పునరావాసం కల్పించాలని కోరుతోంది. ప్రకృతి పేరుతో తప్పించుకోవద్దు… కాలుష్యానికి బాధ్యత వహించండి… హిమాలయాలకు చేసిన నష్టానికి మూల్యం చెల్లించండి.. అంటూ ప్రపంచ కాలుష్య దేశాలకు నేపాల్ సూటిగా సవాల్ విసురుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి వేడుకపై అమెరికా భీకర దాడి.. ‘బిగ్గెస్ట్ అటాక్’ ఇంకా మిగిలే ఉంది.. ట్రంప్ సంచలన వార్నింగ్
ఇంత ఈగో పనికారాదమ్మా.. యశ్ తల్లికి RGV కౌంటర్
Irumudi: 200 కోట్ల ఇరుముడి.. ప్రొడ్యూసర్‌కు మామూలు లాభాలు కాదు!
Jailer 2: విజయ్ ప్రభుత్వంపై జైలర్ డైలాగ్స్.. క్లారిటీ
TOP 9 ET News: “బాబాయ్ అంటే ఇంతే!” చరణ్ ఎమోషనల్.. బన్నీ క్రేజీ విష్
