Plane Crash: అది ప్రమాదం కాదు.. విమానం క్రాష్‌పై వెలుగులోకి షాకింగ్ విషయాలు.!
చైనాలో ఈ ఏడాది మార్చిలో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిజానికి ఇది ప్రమాదం కాదని.. ఉద్దేశపూర్వకంగానే ఎవరో ఆ దారుణానికి పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు...
చైనాలో ఈ ఏడాది మార్చిలో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిజానికి ఇది ప్రమాదం కాదని.. ఉద్దేశపూర్వకంగానే ఎవరో ఆ దారుణానికి పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు ముందే అంచనా వేశాయి. ఆ విమానంలో లభించిన బ్లాక్‌బాక్స్ ఆధారంగా చేపడుతున్న దర్యాప్తులో ముందుగా ఊహించినట్లుగానే ఇది ప్రమాదం ఘటన కాదని తేలింది. అయితే ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 132 మందితో వెళ్తున్న విమానం గువాంగ్షీలోని వూఝౌ నగర సమీపంలోని పర్వత ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చైనా ఈస్టర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం.. కున్మింగ్ నుంచి గువాంగ్ ఝౌకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విమానం కూలినప్పుడు పర్వత ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఓ ప్రముఖ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఇచ్చిన వివరాల ప్రకారం.. వూజౌ నగరానికి నైరుతి దిక్కులో కొంతదూరం ప్రయాణించగానే విమానం నుంచి సిగ్నల్స్ ఆగిపోయినట్లుగా తెలిపింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ జెట్ విమానం 30వేల అడుగుల ఎత్తులో ప్రయాణించినట్లు వెల్లడించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!
killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..