గాజాపై అణుబాంబు ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ !!
ఇజ్రాయెల్-హమాస్ వార్ కీలక మలుపు తిరగబోతోందా? గాజాపై ఇజ్రాయెల్ అణుబాంబును ప్రయోగిస్తుందా? అవును,అందరిలో ఇదే ఆందోళన నెలకొంది. తాజాగా ఇజ్రాయెల్ మత్రి అమిహై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. గాజా స్ట్రిప్‌పై అణుబాంబు వేసే అవకాశాలను ఇజ్రాయెల్ పరిశీలిస్తుందని ఇజ్రాయిలీ మంత్రి అమిహై ఎలియహు ప్రకటించారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో అణు బాంబును ప్రయోగించే అవకాశం ఉందా
ఇజ్రాయెల్-హమాస్ వార్ కీలక మలుపు తిరగబోతోందా? గాజాపై ఇజ్రాయెల్ అణుబాంబును ప్రయోగిస్తుందా? అవును,అందరిలో ఇదే ఆందోళన నెలకొంది. తాజాగా ఇజ్రాయెల్ మత్రి అమిహై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. గాజా స్ట్రిప్‌పై అణుబాంబు వేసే అవకాశాలను ఇజ్రాయెల్ పరిశీలిస్తుందని ఇజ్రాయిలీ మంత్రి అమిహై ఎలియహు ప్రకటించారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో అణు బాంబును ప్రయోగించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ఈ అంశాన్ని కూడా ఇజ్రాయెల్ పరిశీలిస్తోందని చెప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్ మంత్రి న్యూక్లియర్ బాంబు ప్రయోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చేసిన వ్యాఖ్యలపై.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. మంత్రి వ్యాఖ్యలు వాస్తవం కాదని తోసిపుచ్చారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఇజ్రాయెల్, ఐడీఎఫ్‌లు నడుచుకుంటున్నాయన్నారు. విజయం సాధించే వరకు గాజాపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రిని ప్రభుత్వ సమావేశాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోతికోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న చిరుత..ఏం జరిగిందంటే ??
పాడేరు మంచు అందాలు.. మేఘాలకొండకు పెరిగిన పర్యాటకుల తాకిడి
ఆ విమానాల్లో ప్రయాణించొద్దు.. భారతీయులకు పన్నూ వార్నింగ్
భార్యకోసం భర్త త్యాగం.. ఒంటికాలిపై 120 కి.మీ. నడిచిన వ్యక్తి.. నెటిజన్లు ఫిదా
మంచి మనసు చాటుకున్న టీ ఎస్టేట్ యజమాని !! ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్‌లు..
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

