Iran vs USA Conflict: యుద్ధం ఇలాగే కొనసాగితే భారత్ చమురు అవసరాల పై భారం

Updated on: Apr 13, 2026 | 7:43 PM

హార్ముజ్ జలసంధి దిగ్బంధనంపై ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇది సుదీర్ఘకాలం కొనసాగితే అమెరికా ఇంధన ధరలు పెరగడంతో పాటు భారత్ చమురు అవసరాలు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. యుద్ధ పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తూ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.

ఇరాన్, అమెరికా మధ్య హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. జలసంధిని దిగ్బంధిస్తామన్న అమెరికాకు ఇరాన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇదే జరిగితే అమెరికాలో ఇంధన ధరలు భారీగా పెరుగుతాయని ఇరాన్ స్పీకర్ హెచ్చరించారు. ఇటీవల ఇరు దేశాల మధ్య చర్చలు విఫలం కావడంతో అనిశ్చితి నెలకొంది. డోనాల్డ్ ట్రంప్ జలసంధిని బ్లాక్ చేస్తామని ప్రకటించగా, జలసంధి తమ ఆధీనంలోనే ఉందని ఇరాన్ సైన్యం పేర్కొంది. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో 150కి పైగా చమురు సరుకు నౌకలు నిలిచిపోయాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Thalapathy Vijay: తమిళనాడులో ఆకట్టుకుంటున్న విజయ్ ఎన్నికల ప్రచారం

Jr NTR: ధురంధర్‌ను ఫాలో అవుతున్న ఎన్టీఆర్.. 6 నెలల్లో రెండు భాగాలు

Asha Bhosle: గాయనిగా ఆశా భోంస్లే ప్రస్థానమిది

Yash: ఏక్ విలన్.. యశ్ ప్లానింగ్ అదిరింది కదా

చరణ్, బన్నీ, తారక్ మధ్య వార్.. కారణం అతడే

Follow Us