ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తే.. మూడో ప్రపంచ యుద్ధమేనా ??

|

Oct 18, 2024 | 12:13 PM

ఇరాన్ పై ఇజ్రాయెల్ పగతో రగిలిపోతోంది. తనపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. అదును కోసం వేచి చూస్తోంది. ఈసారి ఇరాన్ పై దాడి చేయడమంటూ జరిగితే.. ఆ దేశం అస్సలు కోలుకోలేకుండా ఉండేలా దెబ్బ తీయాలని పక్కా స్కెచ్ ను రెడీ చేస్తోంది. ఇరాన్ లో ఏఏ ప్రాంతాల్లోని.. ఏఏ స్థావరాలపై అటాక్ చేయాలో ఇప్పటికే ప్లాన్ ను రెడీ చేసింది.

చివరి నిమిషంలో ఏమైనా మార్పులు ఉంటే తప్ప ఏమాత్రం వెనక్కు తగ్గడానికి నెతన్యాహూ టీమ్ అస్సలు సిద్ధంగా లేదు. ఇజ్రాయెల్ దళాలు కూడా దాడి చేయడానికి ఊవ్విళ్లూరుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే.. నవంబర్ 5 లోపే అటాక్ చేయాలన్నది ఇజ్రాయెల్ ప్లాన్. అంటే రెండు నుంచి మూడు వారాల లోపే ఇజ్రాయెల్ తన ప్లాన్ ను అమలు చేయబోతోందని అర్థమవుతోంది. మరి ఈ దాడి జరిగితే.. అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఇప్పటికే మిగిలిన దేశాలు దానికి సిద్ధమవుతున్నాయా? అమెరికాతో పాటు.. ఇతర దేశాలు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నాయి? యుద్ధమంటూ జరిగితే.. మన దేశం స్టాండ్ ఏమిటి? ఏ దేశాన్ని సపోర్ట్ చేయబోతోంది? లేక.. తటస్థంగా ఉంటుందా? ఇరాన్ లో ఏఏ లక్ష్యాలను గురిపెట్టాలి అన్నదానిపై.. ఇజ్రాయెల్ సైన్యం బ్లూ ప్రింట్ రెడీ చేసింది. దీనిని దేశ ప్రధాని నెతన్యాహుతోపాటు డిఫెన్స్ మినిస్టర్ కు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. సో.. టార్గెట్స్ ఫిక్స్ అయినట్టే. ప్రభుత్వం ఎప్పుడు దాడి చేయమంటే.. అప్పుడు అటాక్ మొదలుపెట్టడమే ఆలస్యం అని అర్థమవుతోంది. ఇరాన్ లో ఎక్కడెక్కడ దాడి చేస్తామన్నదానిపై ఇజ్రాయెల్.. ఇప్పటికే అగ్రరాజ్యానికి బ్రీఫింగ్ ఇచ్చిందని సమాచారం. దేశ పరిస్థితుల దృష్ట్యా కొన్ని వివరాల గురించి చెప్పకపోయినా.. ఆల్ మోస్ట్.. అమెరికాతో కీలకమైన సమాచారాన్ని షేర్ చేసుకున్నట్టే. కాకపోతే లాస్ట్ మినిట్ లో టార్గెట్స్ మార్చే అవకాశం లేకపోలేదు. ఇజ్రాయెల్ స్కెచ్ ను పసిగట్టినట్టే ఉంది ఇరాన్. అందుకే తమ జోలికి వస్తే తడాఖా చూపిస్తాం అని క్లియర్ కట్ గా చెబుతోంది. ఒకవేళ ఇజ్రాయెల్ దాడికి దిగితే.. ఇరాన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? దాడికి ఎలాంటి స్కెచ్ వేసింది?

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికా ఎన్నికల ప్రచారంలో తెలుగులో బ్యానర్లు

శుభవార్త.. లైట్ మోటార్ వాహనాలకు.. టోల్ ఫీజులు రద్దు

గుర్రానికి ఊహించని షాక్ ఇచ్చిన పొట్టేలు.. ఏం చేసిందో చూడండి !!

లక్కీ లాటరీ గెలుచుకున్న నరేంద్రమోదీ.. ప్రైజ్‌ ఎంతంటే ??

తప్పుడు వార్తలపై… సీరియస్ అయిన కిచ్చా..

Follow us on