H1B Visa: హెచ్‌–1బీలకు ఉద్యోగాలివ్వకండి టెక్సాస్‌ గవర్నర్‌ ఆదేశాలు

Updated on: Feb 01, 2026 | 11:07 PM

టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిధులతో పనిచేసే విశ్వవిద్యాలయాల్లో హెచ్-1బీ వీసాదారుల నియామకాలను 2027 మే 1 వరకు నిలిపివేయాలని ఆదేశించారు. అమెరికా ఉద్యోగాలు అమెరికా కార్మికులకే దక్కాలనే ఉద్దేశ్యంతో ఈ చర్య తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో టెక్సాస్‌లో హెచ్-1బీ వీసాదారుల కష్టాలు పెరుగుతున్నాయి.

టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిధులతో పనిచేసే టెక్సాస్ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా హెచ్-1బీ వీసాదారులను నియమించడాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. అమెరికాలో ఉద్యోగాలు అమెరికా కార్మికులకే, టెక్సాస్‌లో ఉద్యోగాలు టెక్సాస్ ప్రజలకే దక్కాలనే ఉద్దేశ్యంతో ఈ చర్య తీసుకున్నట్లు గవర్నర్ గ్రెగ్ స్పష్టం చేశారు. ఈ ఆదేశాల మేరకు, కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తుల పరిశీలనను తక్షణమే నిలిపివేశారు. అంతేకాకుండా, హెచ్-1బీ వీసాదారులను నియమించుకునే ప్రక్రియను 2027 మే 1వ తేదీ వరకు పూర్తిగా నిలిపివేశారు. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్ నుంచి సిఫార్సు లేఖలు తీసుకువస్తే మాత్రమే పాక్షిక మినహాయింపు వర్తిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Union Budget 2026: తెలుగు రాష్ట్రాలకు లాభమా? నష్టమా? నిర్మలమ్మ లెక్కలు ఇవే

Budget 2026: ఇల్లు కొనేవారికి ఊరట ఏది? రామిరెడ్డి విశ్లేషణ ఇదే

Anil Ravipudi: అనిల్ రావిపూడికి ఊహించని ప్రమోషన్

తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల ఎంట్రీ

బాలీవుడ్‌కు కలిసొస్తున్న సక్సెస్ ఫార్ములా

Follow Us