యుద్ధానికి ముగింపు ఎప్పుడు? ఇజ్రాయెల్ స్పోక్స్ పర్సన్ గై నిర్ సంచలన వ్యాఖ్యలు!

Updated on: Feb 14, 2026 | 1:54 PM

ఇజ్రాయెల్ స్పోక్స్ పర్సన్ గై నిర్, గాజా యుద్ధం, కాల్పుల విరమణ, హమాస్, మానవతా సహాయం, ఇరాన్, అలాగే భారత్‌తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో హమాస్ ఆయుధాలు విడిచిపెట్టడమే రెండో దశ లక్ష్యమన్నారు. ఇజ్రాయెల్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నా, ప్రారంభించాలని కోరుకోవడం లేదని తెలిపారు.

గాజా సంఘటనలు, కాల్పుల విరమణ, మానవతా సహాయం, ఇరాన్‌తో సంబంధాలు, మరియు భారత్‌తో భాగస్వామ్యం వంటి అనేక కీలక అంశాలపై ఇజ్రాయెల్ స్పోక్స్ పర్సన్ గై నిర్ టీవీ9 యూఎస్‌ఏతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ మొదటి దశ పూర్తయిందని, బందీలందరూ తిరిగి వచ్చారని ఆయన తెలిపారు. హమాస్ ఆయుధాలను విడిచిపెట్టడం కాల్పుల విరమణ రెండో దశ లక్ష్యంగా పేర్కొన్నారు. గాజాలో పౌర భవనాలను కూల్చివేయడంపై అడిగిన ప్రశ్నకు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గాజాలోకి ప్రవేశించినప్పుడు ప్రతి రెండవ ఇల్లు బాంబులతో నిండి ఉందని, హమాస్ సొరంగాలు, బాంబులను కనుగొందని వివరించారు. మానవతా సహాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంటుందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రతి నెలా వేల ట్రక్కుల సహాయాన్ని గాజాలోకి పంపుతున్నామని, హమాస్ ఈ సహాయాన్ని దోచుకుంటుందని ఆరోపించారు.

మరిన్ని వీడియోల కోసం :

రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న క‌వ‌లల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!

బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!

బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!

సొంతకారులో ఉత్సాహంగా ఇంటికి వెళ్తున్న యువకుడు..అంతలోనే..

హాస్టల్‌లో ఉండటానికి భయపడుతున్న విద్యార్థులు.. ఎందుకంటే?