గుడ్‌న్యూస్‌.. హెచ్-1బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజుకు బ్రేక్

Updated on: Oct 04, 2026 | 10:10 PM

అమెరికాలో పనిచేస్తున్న, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు భారీ ఊరట లభించింది. కొత్త హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వం విధించిన 1 లక్ష డాలర్ల ఫీజును కాలిఫోర్నియా ఫెడరల్‌ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. నిబంధనలను అమలు చేసే ముందు ఫెడరల్‌ ఏజెన్సీలు అడ్మినిస్ట్రేటివ్‌ ప్రొసీజర్‌ యాక్ట్‌ ప్రకారం అవసరమైన విధానాలను పాటించలేదని జడ్జి హేవుడ్‌ గిలియమ్‌ పేర్కొన్నారు. ఈ ఫీజును అడ్డుకోవడం ఇది రెండోసారి.

అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న, చేయాలనుకుంటున్న భారతీయ ఐటీ నిపుణులకు భారీ ఊరట లభించింది. హెచ్-1బి వీసాలపై ట్రంప్ ప్రభుత్వం విధించిన లక్ష డాలర్ల భారీ ఫీజు విధానానికి అమెరికా ఫెడరల్ కోర్టు మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. ఈ వివాదాస్పద ఫీజు వసూలును తక్షణమే నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి హేవూడ్ ఎస్. గిలియమ్ జూనియర్ ఈ కీలక తీర్పును వెలువరించారు. ఈ అదనపు ఫీజును అమలు చేసే క్రమంలో ఫెడరల్ ఏజెన్సీలు ‘అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్’ కింద పాటించాల్సిన చట్టబద్ధమైన నియమ నిబంధనలను తీవ్రంగా విస్మరించాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు. విద్యాసంస్థలు, ఆరోగ్య రక్షణ సంస్థలు, తయారీ కంపెనీలు మరియు కార్మిక సంఘాలు సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలు, వాటి పొడిగింపును ఈ తీర్పు అడ్డుకుంటుంది. మొత్తం హెచ్-1బి వీసాదారుల్లో దాదాపు 71 శాతం మంది భారతీయులే ఉన్నందున, ఈ లక్ష డాలర్ల ఫీజు నిర్ణయం వారి ఉపాధి అవకాశాలను, కుటుంబాల భవిష్యత్తును తీవ్ర ముప్పులోకి నెట్టివేసిందని సౌత్ ఏషియన్ అమెరికన్ జస్టిస్ కొలాబరేటివ్ ప్రతినిధులు పేర్కొన్నారు. అమెరికన్ ఉద్యోగుల ప్రయోజనాలు రక్షించడానికే ఈ నిబంధనలు తెచ్చామని ట్రంప్ సర్కార్ వాదిస్తున్నప్పటికీ, న్యాయస్థానాలు మాత్రం ఆ వాదనతో ఏకీభవించడం లేదు. ఈ ఫీజును కోర్టులు నిలిపివేయడం ఇది వరుసగా రెండోసారి. గతంలో మసాచుసెట్స్ ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ చేసినా స్టే ఇచ్చేందుకు నిరాకరించగా, తాజాగా కాలిఫోర్నియా కోర్టు తీర్పుతో ట్రంప్ సర్కార్‌కూ మరో న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి పాస్ వచ్చేసింది.. రోజువారీ, నెలవారీ ధరలివే!

ప్రయాణికుడి దుస్సాహసం.. టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు యత్నం!

పంటను కాపాడుకోబోయి.. ప్రాణాలే కోల్పోయారు!

తెల్లవారితే పెళ్లి.. ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చి వరుడితో ఏదో మాట్లాడింది.. ఉదయం చూసేసరికి వరుడు…

అమ్మబాబోయ్‌.. చిమ్మచీకట్లో గోడపై నక్కిన వింత ఆకారం!

Loading...
Unable to load recommendations.
Follow Us