Viral Video: బ్రెజిల్‌లో వింత !! తోకతో జన్మించిన బాలుడు !! వీడియో

Updated on: Nov 14, 2021 | 7:53 PM

బ్రెజిల్‌లో జన్మించిన ఓ వింత శిశువు వైద్యులనే ఆశ్చర్యపరిచింది. ఫోర్టలెజా పట్టణానికి చెందిన నిండు గర్భిణి ఒకరు ఆల్బెర్ట్ సాబిన్ అనే పిల్లల ఆసుపత్రిలో చేరింది.

బ్రెజిల్‌లో జన్మించిన ఓ వింత శిశువు వైద్యులనే ఆశ్చర్యపరిచింది. ఫోర్టలెజా పట్టణానికి చెందిన నిండు గర్భిణి ఒకరు ఆల్బెర్ట్ సాబిన్ అనే పిల్లల ఆసుపత్రిలో చేరింది. సాధారణ కాన్పునకు అవకాశం లేకపోవడంతో శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీసిన వైద్యులు బాలుడికి తోక ఉండడం చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. 12సెంటీమీటర్ల పొడవున్న ఆ తోక చివర్లో 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో బంతిలాంటి ఆకారం కూడా ఉండడం వైద్యులను ఆశ్చర్యపరిచింది. మహిళ గర్భం దాల్చిన తర్వాత అదే ఆసుపత్రిలో తరచూ పరీక్షలు చేయించుకున్నప్పటికీ ఎప్పుడూ ఆ తోకను గుర్తించలేదని వైద్యులు తెలిపారు. దీనిని నిజమైన మానవతోకగా అభివర్ణిస్తున్న వైద్యులు.. ఆ తోకకు నాడీ వ్యవస్థకు ఎలాంటి అనుసంధానం లేదని, చర్మానికి మాత్రమే పెరిగిందని పేర్కొన్నారు. ఆపరేషన్ చేసి ఆ తోకను తొలగించినట్టు తెలిపారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

బాత్‌రూమ్‌లోనే ఎక్కువగా గుండెపోటు.. అమెరికా వైద్యుల చేసిన షాకింగ్‌ కామెంట్స్‌.! వీడియో

Dog Practices Squid Game : కుక్క ఎంతో ఈజీగా స్క్విడ్‌ గేమ్‌ ఆడేస్తోంది !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us