భారత్‌ చేరుకున్న అమెరికా వలసదారుల విమానం వీడియో

Updated on: Feb 06, 2025 | 11:59 AM

అమెరికా నుంచి వలసదారులు ప్రత్యేక విమానంలో 104 మంది అమృత్‌సర్‌కి చేరుకున్నారు. ట్రంప్‌ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపింది అమెరికా ప్రభుత్వం. అంతేకాదు అక్కడ అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపుతోంది. చట్టవ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టినవారిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపింది. 104 మందితో టెక్సాస్‌ నుంచి బయల్దేరిన అమెరికా సైనిక విమానం సీ-17..

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో దిగింది.అమెరికా నుంచి వచ్చినవారు పంజాబ్‌తో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందినవారిగా తెలుస్తోంది. అయితే వీరిని అదుపులోకి తీసుకునేందుకు స్వదేశంలో ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో తనిఖీల అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి బయటకు పంపించనున్నారు. వెనక్కి పంపే ముందు ప్రతిఒక్కరి రికార్డులను పరిశీలించినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్‌కు రానున్నాయని వివరించారు.అమెరికా హోంలాండ్‌ అధికారుల లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల దగ్గర సరైన పత్రాలు లేనట్లు గుర్తించారు. వీరిలో 17,940 మందిని వెనక్కి పంపేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అండ్‌ రిమూవల్‌ ఆపరేషన్స్‌ నిర్బంధంలో ఉన్నారు. తొలివిడతలో భాగంగా 104 మందిని వెనక్కి పంపించారు